నేడు విదేశీయుల స్ఫూర్తితో పెటా, బ్లూక్రాస్ అంటూ జంతు, ప్రకృతి ప్రేమికులమంటూ కొందరు ట్యాగ్‌లు తగిలించుకుంటున్నారు. మంచిదే. కానీ దీనిని వేల సంవత్సరాల ముందటే మనవేదాలు, ఉపనిషత్తులు, పెద్దలు ఎంతో గొప్పగా చెప్పారు. పంచభూతాలు మనకి కనిపించే దేవుళ్లని, ప్రకృతిలో ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడటమే దేవుడికి మనం ఇచ్చే నిజమైన బహుమతి అని చెప్పారు. షిర్డీ సాయిబాబా తనకు తెచ్చిన తిండిని కుక్క తింటే నేను తిన్నాను. నా కడుపు నిండింది అని చెప్పాడు. పెద్దలు కూడా మన మానవశరీరం మాంసాహారం తినేట్లు రూపొందించబడలేదని, మనం కేవలం సాత్వికాహారం, శాఖాహారులమేనని నొక్కిచెప్పారు.
కానీ తినే తిండి, కట్టే బట్టే, జీవన విధానం మన స్వేచ్చకి, స్వాతంత్య్రానికి ప్రతీకలంటూ కొత్త వాదనలు మొదలయ్యాయి. మాంసాహారం తింటూ జంతు ప్రేమికులము, ప్రకృతి ప్రేమికులమని మనకి మనం భుజాలు చరుచుకుంటే లాభం లేదు. మరి ఏదైనా తినడమే మన స్వేచ్చ అనుకుంటే వన్యప్రాణులను చంపడం, తినడం ఎలా నేరం అవుతుంది? అనేది ప్రశ్న. ఇక విషయానికి వస్తే తోటి మనిషిని మనిషిగా చూడని, వారు ఆకలిని కూడా పట్టించుకోని వారు స్టేటస్ కోసం జంతువులను మాత్రం ఎంతో గొప్పగా, తమ ఇంట్లో వారికంటే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే తన పెంపుడు కుక్క అనారోగ్యం పాలు కావడంతో మిల్కీబ్యూటీ తమన్నా కీలక నిర్ణయం తీసుకుంది. తమన్నా కొన్నేళ్లుగా లాబ్రాడూడుల్ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటోంది. దాని పేరు పెబెల్స్.
కొన్నిరోజుల కిందట ఈ పెబెల్స్ మాంసాహారం తినడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైందట. వైద్యుల వద్దకు వెళ్లితే పారాలిటిక్ ఎటాక్ వచ్చిందని చెప్పారట. దాంతో కుక్కకు మాంసాహారం పెట్టడం మానివేశారు. దాంతో తాను కూడా పూర్తిగా వెజిటేరియన్‌గా మారిపోయానని తమన్నా చెప్పుకొచ్చింది. తన కుటుంబంలోని అందరు మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారని, కానీ విల్ పవర్‌తో తాను దానిని అధిగమిస్తానని తమన్నా చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం తమన్నా ‘సై..రా, ఎఫ్2, క్వీన్’ చిత్రాలతో బిజీగా ఉంది.