Advertisementt

నాగ్, నాని.. విశ్వరూపం చూపెట్టారు

Sat 29th Sep 2018 01:56 PM
  నాగ్, నాని.. విశ్వరూపం చూపెట్టారు
Nagarjuna and Nani Highlight to Devadas నాగ్, నాని.. విశ్వరూపం చూపెట్టారు
Advertisement
Ads by CJ

నిన్న శుక్రవారం వైజయంతి మూవీస్ బ్యానర్ లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున - నాని హీరోలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవదాస్ కి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో గీత గోవిందం లాంటి సాలిడ్ హిట్ తర్వాత గత రెండు వారాలుగా థియేటర్స్ లో ఓ అనే రేంజ్ సినిమా లేదు. నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడుకి యావరేజ్ టాకొచ్చినా.. ప్రేక్షకులు సర్దుకుపోయి.. కలెక్షన్స్ పరంగా బావుందనిపించారు. ఇక సమంత యూ టర్న్ టాక్ సూపర్.. కానీ కలెక్షన్స్ నిల్. ఇక గతవారం విడుదలైన సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సో సో టాక్ తో నడిచింది. మరి రెండు వారాలుగా మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు దేవదాస్ సినిమాతో కాస్త ఊరట లభించింది.

కథలో బలం లేకపోయినా... నాగార్జున - నాని ల స్టార్ డమ్ తో సినిమాకి హిట్ టాక్ తీసుకొచ్చాడు శ్రీ రామ్ ఆదిత్య. మాములుగా ఇద్దరు స్టార్స్ నటిస్తున్నారంటేనే మంచి క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో చూస్తాం. మరి మన్మధుడు నాగ్ - నేచురల్ స్టార్ నాని కలిసి ఒకే సినిమాలో అంటే.. ఆ సినిమా మీద మంచి హైప్ ఉంటుంది. అలాగే మంచి బిజినెస్ జరగడంతో దేవదాస్ మీద ట్రేడ్ లోను మంచి అంచనాలే ఉన్నాయి. మంచి అంచనాలతో వచ్చిన దేవదాస్ సినిమాకి మెయిన్ బలం నాగార్జున - నాని క్యారెక్టర్స్, దేవాగా నాగ్, దాస్ గా నాని నటనలో ఇరగదీశారు. దేవ్ గా డాన్ పాత్రలో నాగార్జున అదరగొట్టేశాడు. స్టైలిష్ లుక్స్ లో నాగార్జున సూపర్ గా డాన్ పాత్రలో కామెడీ పండించాడు. ఇక దాస్ గా అమాయమైన డాక్టర్ అతి మంచితనంతో నాని కావాల్సినంత ఎంటెర్ టైన్ మెంట్ ఇచ్చాడు. తన నేచురల్ యాక్టింగ్ తో నాని అదరహో అనిపించాడు.

ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కూడా నాగార్జున - నాని ల క్యారెక్టర్స్ ని మాత్రమే తెగ హైలెట్ చేసి హీరోయిన్స్ కి, విలన్ కి ఇతర పాత్రలకు అస్సలు ఇంపార్టెన్స్ లేకుండా చేశాడు. ఇక దర్శకుడు హైలెట్ చేసినట్టుగానే నాని, నాగ్ తమ తమ పాత్రల్లో విశ్వరూపం చూపెట్టారు. డాన్ గా నాగార్జున కామెడీ, దాస్ గా నాని కామెడీ.. అలాగే నాగ్ - నాని మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక హీరోయిన్స్ రష్మిక, ఆకాంక్షలు గ్లామర్ పరంగా మురిపించినా పాత్రల పరంగా ప్రాధాన్యత లేకుండా పోయారు. ఇక మణిశర్మ మ్యూజిక్ సో సో గా ఉన్నప్పటికీ.. ఆయనకి మెయిన్ బలమైన బ్యాగ్రౌండ్ స్కోర్ దంచేశాడు. ఇక ఈ దేవదాస్ సినిమాకి సినిమాటోగ్రఫీ, నిర్మాత పెట్టిన ఖర్చులు ప్లస్ కాగా... సినిమాలో కథలో బలం లేకపోవడం, శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్ స్కిల్స్ కాస్త వీక్ గా వుండటం.. ఎడిటింగ్ లో లోపాలతో సినిమాకి యావరేజ్ టాకే పడుతుంది. కాకపోతే ప్రేక్షకులు కామెడీ ఎంటెర్టైనెర్స్ కోరుకుంటున్నారు కాబట్టి ఈ వీకెండ్ కాస్త ఊపైతే దేవదాస్ కి ఉంటుంది.

Nagarjuna and Nani Highlight to Devadas:

Praises on Nag and Nani Acting in Devadas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ