రాజమౌళి సినిమాలంటే భారీ తనంతో కూడుకున్నవి. ఆయన తాను అనుకున్నది అనుకున్నట్టుగా సినిమా చేసి చూపెట్టగల సత్తాగల దర్శకుడు. స్క్రిప్ట్ లాక్ చేశాక మధ్యలో స్క్రిప్ట్ లో వేలెత్తి కెలకడం వంటివి చెయ్యడం కానీ.. తన దర్శకత్వం విషయంలో హీరోలు వేలెట్టి కెలికే అవకాశం కూడా ఇవ్వడు. ఇక సినిమాల కోసం రాజమౌళి అద్భుతమైన సెట్స్ ని డిజైన్ చేసి వేయించి మరీ సినిమాలో ఆ భారీ తనాన్ని చూపెట్టగలడు. మర్యాదరామన్న ఇంటి సెట్ కానివ్వండి, బాహుబలి సెట్స్ కానివ్వండి ఎందులోనైనా సరే రాజమౌళి భారీ తనం కనబడుతుంది. ఇక తాజాగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ సినిమా కోసం ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతుండగా.. ఆయన ఆ సినిమా కోసం అక్కడే అందుబాటులో ఉండేందుకు.. అలాగే ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండేందుకు ఒక పెద్ద ఇంటి నిర్మాణాన్ని కోట్ల రూపాయలతో సెట్ రూపంలో వేస్తున్నాడనే టాక్ ఉంది.
మరి అంత భారీ తనం కోరుకునే రాజమౌళి.. ఆయన ఫ్యామిలీ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. రాజమౌళి కానీ ఆయన భార్య రమా కానీ ఎక్కడికెళ్లినా చాలా సింపుల్ గా వెళతారు. మరి నిజ జీవితంలో చాలా సాదాసీదాగా వుండే రాజమౌళి సినిమాల విషయంలో భారీ బడ్జెట్, భారీ తనం కోరుకుంటాడు. మరి ఇప్పుడు రాజమౌళి కొడుకు కార్తికేయ తాజాగా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. జగపతి బాబు అన్న కూతురు పూజ ని ప్రేమించి ఇటీవలే చాలా సింపుల్ గా బంధువుల మధ్యన ఎంగేజ్మెంట్ చేసుకున్న కార్తికేయ పెళ్లి ఎలా జరగబోతుంది. ఇండస్ట్రీలో టాప్ లో పొజిషన్ లో ఉన్న టాప్ దర్శకుడైన రాజమౌళి తన కొడుకు పెళ్ళయి ఎలా చెయ్యబోతున్నాడు. అలాగే ఆ పెళ్లి హైదరాబాద్‌లో జరుగుతుందా? లేదంటే డెస్టినేషన్ వెడ్డింగా? అనే డౌట్స్ లో ఉన్నారు జనాలు.
ఇక కార్తికేయ - పూజ వెడ్డింగ్ మీద రకరకాల వార్తలొస్తున్న నేపథ్యంలో కార్తికేయ తన పెళ్లి ముచ్చట్లను ఒక మీడియా ఛానల్ తో పంచుకున్నాడు. తన పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ లా జరగాలని తనకి డెస్టినేషన్ వెడ్డింగ్ ఇష్టమని చెప్పాడు. అసలు తనకు పూజ పరిచయం కాకముందే... ఈ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ అయ్యి ఉండాలనే కోరిక ఉందని చెప్పిన కార్తికేయ తన పెళ్లి లొకేషన్ ఎక్కడనేది మాత్రం ఫైనల్ కాలేదని చెబుతున్నాడు. బీచ్ ఏరియా లేదా హిల్స్ స్టేషన్‌లో తన పెళ్లి జరగాలని కోరుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది తండ్రి రాజమౌళియే అంటూ కార్తికేయ తన పెళ్లి ముచ్చట్లను ఆ ఛానల్ తో పంచుకున్నాడు. అయితే కార్తికేయ - పూజ ల పెళ్లి విషయమై ప్రస్తుతం ఇరువర్గాల మధ్యన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.