Advertisementt

‘విశ్వదాభిరామ’ ఫస్ట్ లుక్ వదిలారు

Thu 27th Sep 2018 09:29 PM
viswadabhirama,first look,raj kandukuri,viswadabhirama first look  ‘విశ్వదాభిరామ’ ఫస్ట్ లుక్ వదిలారు
Viswadabhirama First Look Released ‘విశ్వదాభిరామ’ ఫస్ట్ లుక్ వదిలారు
Advertisement
Ads by CJ

చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వదాభిరామ’. సురేష్ కాశి, సురేంద్ర కమల్, అశోక్‌చక్రం దర్శకత్వం వహిస్తున్నారు. భువన్‌తేజ్, అనిల్, ఆనంద్, సహస్ర, రొజారెడ్డి, మానస కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం క్రౌడ్ ఫండెడ్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను, మోషన్ పొస్టర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి లాంఛ్ చేశారు. 

దర్శకులు మాట్లాడుతూ కొండవీటి కోట నేపథ్యంలో సాగే డెత్ గేమ్ థ్రిల్లర్ ఇది. ఇప్పటి వరకు కామెడీ పాత్రల్లో ఆకట్టుకున్న చిత్రం శ్రీను తొలిసారి ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు: సురేష్ కాశీ, కెమెరా: అజీమ్, తరుణ్ సోనూ.

Viswadabhirama First Look Released:

Raj Kandukuri Launches Viswadabhirama First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ