నిన్నమొన్నటి తరంలో నటీనటులు రోజంతా నాలుగైదు షిఫ్ట్‌లలో సినిమా షూటింగ్‌లు చేస్తూ ఉండేవారు. ఉదాహరణకు కృష్ణనే తీసుకుంటే ఏడాదిలో ఆయన నటించిన చిత్రాలు 15రోజులకు ఒకటి చొప్పున ఏడాదంతా విడుదలయ్యేవంటే వారి కష్టం అలా ఉండేది. ఉదయం ఒక సినిమా షూటింగ్, మధ్యాహ్నం మరోటి, సాయంత్రం మరోటి, అర్ధరాత్రి ఇంకోటి.. ఇలా ఉండేది. ఇక వీటికితోడు సినిమా వేడుకలకు హాజరుకావడం, శతదినోత్సవాలు, అభిమానులు, రాజకీయాలు, స్టూడియోల నిర్వహణ, నిర్మాత, దర్శకులుగా కూడా ఊపిరి సలపకుండా పనిచేసేవారు. చిరంజీవి కూడా అలాగే గడిపాడు. కానీ నిన్నటితరంలో అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నా కూడా ఫ్యామిలీకి, ఇంటికి కూడా సమయం కేటాయిస్తూ, జీవితాన్ని కూడా క్రమపద్దతిలో గడిపి, సినిమాలకు, వ్యాపారాలకు, ఫ్యామిలీకి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం నాగార్జున నుంచే మొదలైంది.
ఈ విషయాన్ని తాజాగా నాని కూడా ‘దేవదాస్’ ప్రమోషన్స్‌లో చెప్పాడు. ఇక విషయానికి వస్తే ఈ విషయంలో నాగచైతన్య, సమంతలు కూడా నాగ్ బాటలోనే నడుస్తున్నారు. పనికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో, తమ వివాహ జీవితానికి, పర్సనల్‌లైఫ్‌కి కూడా అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక ఈ ఏడాది అంతా సమంత హవా నడిచింది. మరోవైపు భార్యభర్తలైన నాగచైతన్య, సమంతలు నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు, యూటర్న్’ చిత్రాలు రెండు ఒకే రోజున విడుదలై పోటీ పడ్డాయి. టాక్ పరంగా ‘యూటర్న్’ కి మంచి పేరు వస్తే, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కలెక్షన్లను ‘శైలజారెడ్డి అల్లుడు’ కొల్లగొట్టింది. రెండు విభిన్న కథాంశాలు కావడంతో రెంటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
ఇక నాగార్జున నటించిన ‘దేవదాస్’ చిత్రం తాజాగా విడుదలకాబోతోంది. ఇది కూడా హిట్టయితే ఈ ఏడాది కూడా అక్కినేని ఫ్యామిలీ మరింత జోష్‌ని నింపుకుంటుందనే చెప్పాలి. మరోవైపు తామిద్దరం నటించిన చిత్రాలు పాస్‌కావడంతో సమంత, నాగచైతన్యలు రిలాక్స్‌మూడ్‌లోకి వెళ్లిపోయారు. వీరిద్దరు పబ్‌లో ఎంజాయ్ చేస్తూ తీసుకున్న రొమాంటిక్ ఫొటోలను స్వయంగా సమంతనే సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. మరోవైపు ఇందులో అఖిల్ కూడా ఉన్నట్లే కనిపిస్తోంది. ఇక ఈ ఎంజాయ్ మెంట్ వారి పెళ్లిరోజైన అక్టోబర్ 6వ తేదీన బ్రేక్ కానుంది. ఆరోజున నాగచైతన్య, సమంతలు పెళ్లయిన తర్వాత నటిస్తున్న తొలి చిత్రం వారి పెళ్లిరోజునే ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నాడు.