Advertisementt

RC12 పై అప్పుడే ఇన్ని వార్తలా?

Thu 27th Sep 2018 11:33 AM
rc 12,ram charan,boyapati srinu,chiranjeevi,rc 12 shooting updates  RC12 పై అప్పుడే ఇన్ని వార్తలా?
RC 12 Movie Trending in Social Media RC12 పై అప్పుడే ఇన్ని వార్తలా?
Advertisement
Ads by CJ

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ RC12 లో నటిస్తున్నాడు. షూటింగ్ మొదలు పెట్టుకుని కొన్ని నెలలు గడుస్తున్నప్పటికీ... ఇంతవరకు ఆ సినిమా ఫస్ట్ లుక్ గాని, ఆ సినిమా టైటిల్ గాని బయటికి రాలేదు. చాలా పెద్ద ప్రాజెక్టుల సినిమాల స్టిల్స్, సీన్స్ విడతల వారీగా  లీకవుతున్నప్పటికీ రామ్ చరణ్ RC12 సంబందించిన స్టిల్స్ గాని, ఆ సినిమా సీన్ గాని ఎక్కడా బయటికి రాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ - బోయపాటి సినిమా షూటింగ్ అజర్‌ బైజాన్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి ఈ చిత్ర బృందానికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చి చిత్ర బృందాన్ని ఖుషి కూడా చేశారు. ఇక చిరు RC12 సెట్స్ కి రావడంతో రెట్టింపు ఉత్సాహంతో... అజర్‌ బైజాన్‌లో ఫారెస్ట్ లో ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్  సీన్స్ ని తెరకెక్కించిన బోయపాటి.. ఇప్పుడు అజర్‌ బైజాన్‌లో ఎయిర్ పోర్ట్ అండ్ రెస్టారెంట్స్ లో మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడట.

యాక్షన్ సీక్వెన్సెస్ కి రిలేటెడ్ సీన్స్ నే బోయపాటి అజర్‌ బైజాన్‌ రెస్టారెంట్ అండ్ ఎయిర్ పోర్ట్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సీక్వెన్సెస్ కోసం కియారా అద్వానీ అజర్‌ బైజాన్‌ చేరుకుంది. అలాగే ఈ యాక్షన్ అండ్ కీలక సన్నివేశాల్లో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్‌తో పాటుగా, ఆర్యన్ రాజేష్ , వివేక్ ఒబెరాయ్ లు కూడా పాల్గొంటున్న విషయాలు... అక్కడనుండి RC12 చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి అజర్‌ బైజాన్‌లో లొకేషన్స్ కొత్తగా సరికొత్తగా ఉన్నాయనే టాక్ మాత్రం మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేసేస్తుంది. మరో వారానికల్లా అజర్‌ బైజాన్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి హైదరాబాద్ కి చిత్ర బృందం తిరుగు పయనం కానుందని సమాచారం అందుతుంది.

ఇకపోతే RC12 కి టైటిల్ గా నిన్నటినుండి సోషల్ మీడియాలో ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఏదో ఒక అభిమాని చిరు సూపర్ హిట్ చిత్రం స్టేట్ రౌడీ ని చరణ్ ఫోటోతో స్వంతంగా డిజైన్ చేసి పోస్టర్ రూపంలో ఆన్ లైన్ లో పెట్టేయడంతో అది కాస్తా వైరల్ గా మారి చరణ్ - బోయపాటి సినిమా టైటిల్ అదే అనుకునే ప్రచారం జరిగింది.  అయితే RC12 బృందం మాత్రం స్టేట్ రౌడీ అనే టైటిల్ అసలు పరిశీలనలోనే లేదట. ఇదంతా వట్టి పుకారు అని కొట్టిపారేస్తోంది. టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదని విడుదలకు ఇంకా మూడు నెలలకు పైగా సమయం ఉంది కాబట్టి మంచి టైం చూసుకుని చెప్పేస్తాం అంటున్నారు. మరి RC12 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ దసరా కానుకగా విడుదల చేస్తారనే ప్రచారం మాత్రం మెగా ఫ్యాన్స్ కి అప్పుడే పండుగ వచ్చినంత ఫీలింగ్‌ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే  చాలా రోజుల నుండి చరణ్ లుక్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారాయే.

RC 12 Movie Trending in Social Media:

RC 12 Location Photos Hulchal in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ