Advertisementt

హైద్రాబాద్, విజయవాడలో ‘నోటా’ సందడి

Thu 27th Sep 2018 12:15 AM
nota,promotion,vijay deverakonda,vijayawada,hyderabad  హైద్రాబాద్, విజయవాడలో ‘నోటా’ సందడి
NOTA Public Meet in Hyderabad and Vijayawada హైద్రాబాద్, విజయవాడలో ‘నోటా’ సందడి
Advertisement
Ads by CJ

హైద‌రాబాద్ మరియు విజ‌యవాడ‌ల్లో నోటా ప‌బ్లిక్ మీట్.. 

నోటా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. విడుద‌ల‌కు ముందే విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ ల‌లో రెండు భారీ ప‌బ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 30న విజ‌య‌వాడ‌.. అక్టోబ‌ర్ 1న హైద‌రాబాద్ లో ఈ మీటింగులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మీటింగ్స్ ను ‘ది నోటా ప‌బ్లిక్ మీట్’ అని పేరు పెట్టేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాజ‌ర్, స‌త్య‌రాజ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన పొలిటిక‌ల్ డ్రామా నోటా. 

మెహ్రీన్ ఇందులో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అర్జున్ రెడ్డి.. గీతగోవిందం లాంటి సంచ‌ల‌న సినిమాల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి వ‌స్తోన్న సినిమా ఇది. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప‌తాకంపై జ్ఞాన‌వేల్ రాజా నిర్మించారు. అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా నోటా విడుద‌ల కానుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శాంత‌న కృష్ణ‌న్ ర‌విచంద్ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

NOTA Public Meet in Hyderabad and Vijayawada:

NOTA Promotion Starts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ