Advertisementt

‘సామి’ కలెక్షన్లు ఊపందుకున్నాయట!

Wed 26th Sep 2018 07:01 PM
saamy,bellam ramakrishna reddy,saamy collections,increased  ‘సామి’ కలెక్షన్లు ఊపందుకున్నాయట!
Producer About Saamy Movie Collections ‘సామి’ కలెక్షన్లు ఊపందుకున్నాయట!
Advertisement
Ads by CJ

హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఊపందుకున్న ‘సామి’: నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌‌లో విక్రమ్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా.. డైరెక్టర్ హరి దర్శకత్వంలో.. బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘సామి’. సెప్టెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సెన్సేషనల్ స్టార్ విక్రమ్, డేరింగ్ డైరెక్టర్ హరిగారి కాంబినేషన్‌లో వచ్చిన ‘సామి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. వినాయక చవితి ఉత్సవాలు, క్రికెట్ మ్యాచ్‌లతో ఇప్పటి వరకు కలెక్షన్లు కాస్తంత తగ్గినా.. సోమవారం నుంచి హౌస్‌ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు మా ‘సామి’. కలెక్షన్లు అనూహ్యంగా పుంజుకోవడంతో చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంత మంచి విజయం మాకు అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే ప్రేక్షకులు థియేటర్స్‌ని హౌస్‌ఫుల్ చేసి సామికి అఖండ విజయం అందిస్తారని కోరుకుంటున్నాము..’’ అని అన్నారు. 

చియాన్ విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబీ సింహ, సూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ అంగురాజ్, ఎడిటర్: వి. టి. విజయన్, టి.ఎస్. జయ్, కథ-డైరెక్షన్: హరి, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి.

Producer About Saamy Movie Collections :

Saamy Movie Collections increased

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ