Advertisementt

ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లదే పూర్తి రెస్పాన్సిబిలిటీ..!

Wed 26th Sep 2018 12:36 PM
ntr,trivikram srinivas,aravinda sametha,pre release,event,highlights  ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లదే పూర్తి రెస్పాన్సిబిలిటీ..!
Jr ntr and trivikram Special Hungama at Aravinda Sametha pre release Event ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లదే పూర్తి రెస్పాన్సిబిలిటీ..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత - వీర రాఘవ సినిమా హడావిడి మొదలైపోయింది. మరో పదిహేను రోజుల్లో విడుదలకు సిద్దమవుతున్న అరవింద సమేత సినిమా ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా ఎన్టీఆర్ మాస్ గా కనబడనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమాకి సంబందించిన వర్కింగ్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోస్ లో త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ ల మధ్యన ఉన్న అనుబంధం మాటల్లో చెప్పడం కష్టమనేలా ఉంది. ఒక హీరోకి, డైరెక్టర్ కి ఉండాల్సిన సంబంధం కాదది. ఇద్దరి స్నేహితుల మధ్యన ఉన్న అనుబంధంగా కనబడుతుంది.

అయితే అరవింద సమేత పాటలను ఎలాంటి హడావిడి లేకుండా మార్కెట్ లోకి వదిలిన అరవింద టీం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేస్తుందట. హరికృష్ణ మరణంతో ఒక్కటయిన నందమూరి కుటుంబం.. అందులోను ఎన్టీఆర్ బాబాయ్ హీరో బాలకృష్ణ ఈ అరవింద ఆడియో వేడుక మీద మెరవబోతున్నాడనే న్యూస్ ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది.  అక్టోబరు 2న హైద‌రాబాద్‌లో అరవింద సమేత ప్రీ రిలీజ్ వేడుక చేయాల‌ని ముందుగా అరవింద నిర్మాతలు నిర్ణ‌యించుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు అరవింద ప్రీ రిలీజ్ డేట్ మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 3 న‌ గానీ, 6న గానీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వేడుక నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యేట్లుగా కనబడుతుంది బయట వ్యవహారం. ఎందుకంటే త్రివిక్రమ్ తో పాటుగా చిత్ర బృందం ఇటలీలో ఓ సాంగ్ షూట్ కోసం వెళ్లారు. అయితే వాళ్ళు హైదరాబాద్ చేరుకున్న తర్వాత అరవింద సమేత ఆడియో వేడుకని ఓ రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నారట.

ఈ అరవింద సమేత ఆడియో వేడుకకి బాలకృష్ణ రావడం అనేది ప్రస్తుతం సస్పెన్స్ లో ఉన్న వ్యవహారమే అయినప్పటికీ.. అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హెచ్ఐసిసిలో చాలా భారీగా చేయాలని ప్లానింగ్ చేస్తున్నారట. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ లో అతిధులుగా ఎవరూ రాకపోయినా.. ఈ వేడుకని ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ లే భుజాన వేసుకుని నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారట. ఇప్పటికే హరికృష్ణ మరణంతో కాస్త దిగులుతో ఉన్న నందమూరి ఫ్యాన్స్ అరవింద ప్రీ రిలీజ్ వేడుకని ఎప్పటికి గుర్తుపెట్టుకునే రీతిలో ఈ వేడుకని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అరవింద  ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద ఎన్టీఆర్ తో కలిసి త్రివిక్రమ్ హంగామా చేయబోతున్నాడట. మరి త్రివిక్రమ్ ఇచ్చే స్పీచ్ కు యువత ఎంత ఎట్రాక్ట్ అవుతారో తెలిసిందే. ఇక ఎన్టీఆర్ మాట్లాడితే ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చెయ్యకుండా ఎలా ఉంటారా. సో అదన్నమాట అతిథులు హ్యాండ్ ఇచ్చినా హడావిడి షురూ అనేది.

Jr ntr and trivikram Special Hungama at Aravinda Sametha pre release Event:

Aravinda Sametha pre release event Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ