నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన సినిమా దేవదాస్. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.
ఈ కార్యక్రమంలో నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. మహానటి అప్పుడు నేను ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు. ఈ సినిమాకు మాత్రం పెద్ద హీరోలు నాకు తోడుగా, అండగా.. వాళ్ల భుజాలపై వేసుకుని నడిపించిన సినిమా కాబట్టి మీ ముందుకు వచ్చాను. చాలా ఏళ్ల తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి ప్రతిష్మాత్మకంగా నిర్మించిన చిత్రం ఇది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వించే సినిమా ఇది అవుతుంది. ఇద్దరు గొప్ప హీరోల నటనను మీరు సెప్టెంబర్ 27న చూడబోతున్నారు. చక్కటి వినోదంతో పాటు చిన్న సందేశం కూడా సినిమాలో ఉండబోతుంది. ఈ సినిమా గుండమ్మ కథలా క్లాసిక్ అవుతుందని భావిస్తున్నాను. మీరు ఇచ్చే ప్రోత్సాహంతోనే వైజయంతి మూవీస్ మరింత ముందుకు వెళ్లడానికి.. మా పిల్లలకు ఉత్సాహం ఇవ్వడానికి తోడ్పడుతుందని.. మీ అండదండలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.. అని చెప్పారు.
హీరో నాగార్జున మాట్లాడుతూ.. అశ్వినీదత్ గారు ఆఖరి పోరాటం అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్ ఇంకా అలాగే ఉంది. పైగా ఇప్పుడు ఆయనకు ఇద్దరు హెల్ప్ కూడా వచ్చారు.. తన కూతుళ్లు రూపంలో.. ఒక అల్లుడు రూపంలో హెల్ప్ చేస్తూనే ఉన్నారు. నాలో వచ్చిన తేడా ఏంటంటే ఇప్పుడు టైమ్ కు వస్తున్నాను. దేవ క్యారెక్టర్ ఇంటర్నేషనల్ డాన్ కారెక్టర్ గా తీసుకున్నాం. దాంట్లో వయోలెన్స్ కానీ.. మాఫియా యాక్టివిటీస్ కానీ చూపించలేదు. ఎక్కువగా పర్సనల్ లైఫ్ చూపించాం. అందుకే నాకు కూడా కొత్తగా ఉంది. జనరల్ గా మాఫియా అనగానే అంతా ఒకలా ఊహిస్తారు. కానీ ఇది అలా ఉండదు. అదే కొత్తగా ఉంటుంది కూడా. దాస్ తో ఉండే స్నేహమే దేవదాస్ సినిమా. ఒకరిని ఒకరెలా ఇన్ఫ్లూయెన్స్ చేస్తారనేది సినిమాలో మెయిన్ పాయింట్. ఇది ఏదో సీరియస్ గా తీసిన సినిమా కాదు.. సరదాగా నవ్వుతూ ఉండే సినిమా. మీకు ఎప్పుడున్నా రాజ్ కుమార్ హిరాణి సినిమా చూస్తే మున్నాభాయ్, సంజూ లాంటి సినిమాల జాబితాలో ఉంటుంది దేవదాస్. ముందు కృష్ణదాస్ అనుకున్నాం.. కానీ ఆ తర్వాత దేవదాస్ అని పెట్టారు. పైగా దత్ గారికి కూడా సెంటిమెంట్ మొన్నే మహానటి కూడా వచ్చింది. దేవదాస్ అనేది క్లాసిక్.. రీ కాల్ వ్యాల్యూ కూడా బాగుంటుంది. అందుకే రాయల్ సెల్యూట్ బాటిల్ కూడా పెట్టాం. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నాం.. అందర్నీ బ్యాలెన్స్ చేయడం అనేది దర్శకుడికి ఈజీ కాదు. చాలా ప్రెజర్ ఉంది. ఈ విషయంలో శ్రీరామ్ ఆదిత్య చాలా మొండివాడు. అయితే లేజీ అని ఎందుకు అన్నా అంటే నెల రోజుల ముందే సినిమాను చూపించి ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. 3 డేస్ ముందు కాపీ చూపిస్తే ఏం చేయలేం. ఇది అందరు దర్శకులకు నా విన్నపం. నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి వెళ్లను. అది మీరు అనుకుంటున్నారు.. నేనెప్పుడూ అనుకోను. కేటీఆర్ ఫ్రెండ్ గానే ఉంటాను కానీ రాజకీయాల్లోకి వెళ్లను. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సాంగ్ ఏమో ఏమో.. అది నానికి ఇచ్చారు. జలస్ గా ఫీల్ అవుతున్నాను. సిధ్ శ్రీరామ్ పాడాడు. ఇక వారు వీరు కూడా బాగుంది. నా పక్కన అందమైన అమ్మాయి కూడా ఉంది. చేసే సినిమాలు బట్టి నా గెటప్ మారుతుంది. ఈ సినిమాలో కూడా యంగ్ గా కనిపించడానికి సినిమాటోగ్రాఫర్ స్యామ్ దత్ చాలా పెద్ద కంట్రిబ్యూటర్ సినిమాకు. అన్ని డిస్కస్ చేసుకని అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు.. స్యామ్ తో మరోసారి వర్క్ చేయాలని ఉంది అని.. అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ.. దాస్ చాలా ఇన్నోసెంట్. సాఫీగా సాగుతున్న లైఫ్ లోకి ఊహించకుండా ఎవరూ లైఫ్ లో చూడని ఓ వ్యక్తి ఫ్రెండ్ గా వస్తే వాడి లైఫ్ ఎలా మారిపోతుంది అనేది క్యారెక్టర్. నిజాన్ని నిజంగానే ఈ సినిమాలో చూపించాం. ఫోన్ విషయంలో కూడా ఎప్పుడూ తాను చేతిలో పట్టుకునే ఉంటానని నాగ్ సర్ వీడియో చేసారు. అయితే నాగార్జున గారు పక్కనే ఉన్నపుడు అలాంటి ధైర్యం చేయలేదు కానీ వీడియో చేసే సరికి అది వైరల్ అయిపోయింది. నాగార్జున గారితో స్క్రీన్ స్పేస్ చేసుకోవడమే అదృష్టం. ఆయన సినిమాల కోసం టికెట్ల కోసం కొట్టుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో నటించడం అనేది నా అదృష్టం. నచ్చినా నచ్చకపోయినా ఓపెన్ గా చెప్పేస్తారు. సినిమా అయిపోయిన తర్వాత ఆయన నా గురించి చెప్పిన మాటలు ఎప్పటికీ మరిచిపోలేను. మా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. నా లైఫ్ లో మోస్ట్ హెట్టిక్ వీకెండ్ ఇది. మోస్ట్ స్ట్రెస్ ఫుల్ వీక్.. ఎక్సైటింగ్ వీక్ కూడా ఇదే. బిగ్ బాస్ ఫైనల్ కూడా ఇదే వారం ఉండటంతో ఒత్తిడి ఉంది. ప్లస్ మైనస్ రెండూ ఉన్నాయి. ఈ వారం అయిపోతే కొన్ని రోజులు కాశీకో.. మరెక్కడికైనా అలా వెళ్లిపోతాను... అన్నారు.
హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. నా కారెక్టర్ ఇందులో గాల్ నెక్ట్స్ డోర్ లా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను.. అని చెప్పారు.
హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. నాగార్జున గారు సీన్ విషయాల్లో చాలా హెల్ప్ చేసారు. ఆయన చెప్పిన టిప్స్ అద్భుతంగా పనిచేసాయి. ఆయనతో పనిచేయడం.. స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను.. అని చెప్పారు.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. సెట్ లో మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్స్ నాగార్జున గారు. ఆయన వచ్చిన తర్వాత భయపెట్టడాలు ఉండవు. చాలా కూల్ గా ఉంటాడు. మల్టీస్టారర్స్ అని తేడా నాకు ఉండదు. మల్టీస్టారర్ అంటే ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ఒకేసారి ఇద్దరు బెటర్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. నాకు అది నచ్చుతుంది. బేసిక్ గా ఓ లైన్ విన్నామో.. సత్యానంద్ గారు లాంటి సీనియర్లతో 4 నెలలు కూర్చున్న తర్వాత షూట్ చేయగలిగాను. ఇది ఏ సినిమా రీమేక్ కాదు. సొంత కథతోనే దేవదాస్ తెరకెక్కించాను. ఫ్రెండ్ షిప్ నేఫథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కింది. చిన్న సర్ ప్రైజ్ కూడా ఉంటుంది సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లు ఎన్ని ఉంటాయనేది సినిమా చూసి తెలుసుకోండి. అని చెప్పారు.