బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలుగా విడుదలైన అర్జున్ రెడ్డి సూపర్ బ్లాక్ బస్టర్ అయితే.. ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన RX100 మూవీ హిట్ అయ్యింది. అందుకే ఈ సినిమాలకు ఇతర భాషల్లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే అర్జున్ రెడ్డి తమిళంలో వర్మ గా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతున్నాయి. ఇక అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన RX100 కూడా ఇతర భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అర్జున్ రెడ్డి సినిమా తమిళ్, హిందీ రీమేక్ లకు మంచి రేటు పలికింది. ఇక RX 100 కూడా హిందీ వాళ్ళు కోటిన్నరతో రీమేక్ రైట్స్ కొనుగోలు చేశారు.
హౌస్‌ఫుల్ సిరీస్ తో నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాజిద్ నాదియద్ వాలా RX 100 హిందీ రైట్స్‌ని దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమా హిందీ రీమేక్ లో ఒక యువ హీరో నటిస్తాడనే టాక్ బయలుదేరడం.. అది ఈ రోజు హిందీ RX100 తో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడని ప్రచారం మొదలైంది. సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టికి జస్ట్ 22 ఇయర్స్ కావడం గమనార్హం. ఎంతో ఫ్యూచర్ ఉన్న సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి ఇలా బోల్డ్ కంటెంట్ తో హీరోగా పరిచయం కావడం అనేది కాస్త ఆలోచించదగిన విషయం.
అయితే తమిళంలో అర్జున్ రెడ్డి రీమేక్ లో తమిళ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ కూడా ఇలానే బోల్డ్ కంటెంట్ ఉన్న అర్జున్ రెడ్డి రీమేక్ తోనే తెరకు పరిచయమవుతున్నాడు. మరి యంగ్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలాల్సిన హీరోలంతా ఇలా వైల్డ్ లవ్ స్టోరీస్ ని ఎంచుకుని తప్పుచేస్తున్నారా? లేదా? అనేది ఆ సినిమాల ఫలితాలను బట్టి ఉంటుంది. కాకపోతే ఆ అర్జున్ రెడ్డి సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారాడు. మరి ఇలా వెండితెరకు పరిచయమయ్యే సినిమాల్తోనే స్టార్ రేంజ్ అందుకోవాలని ఆశపడే.. ఈ యంగ్ హీరోలు ఇలాంటి కంటెంట్ తో వస్తున్నారా అనేదే అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ఇకపోతే RX100 తమిళ రీమేక్ లో ఆది పినిశెట్టి హీరోగా నటించబోతున్నాడు.