Advertisementt

ఏంటి సమంత.. బై బై చెప్పేసినట్లేనా..?

Tue 25th Sep 2018 06:27 PM
samantha,glamour roles,lady oriented,nayanthara,nandini reddy  ఏంటి సమంత.. బై బై చెప్పేసినట్లేనా..?
Samantha Interests on Lady Oriented Movies ఏంటి సమంత.. బై బై చెప్పేసినట్లేనా..?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ గ్లామర్ భామగా టాప్ పొజిషన్ లో కొనసాగిన సమంత అందాలు ఆరబోయడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ఆఖరికి పెళ్లయ్యాక  కూడా బికినీ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమంత సినిమాల్లో గ్లామర్ షో విచ్చలవిడిగా  చెయ్యకపోయినా... బాగానే గ్లామర్ ఆరబోసింది. ఎప్పుడూ గ్లామర్ పాత్రలే ఎక్కువగా చేసిన సమంత ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఓటేస్తుంది. మరి నాగ చైతన్యతో పెళ్లయ్యాక కూడా కెరీర్ లో సినిమాల మీద సినిమాలు చేస్తూ హిట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత అక్కినేని ఇంటి కోడలిగా గ్లామర్ పాత్రలకు బై బై చెప్పెయ్యబోతుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన సమంత లేడి ఓరియెంటెడ్ చిత్రాలకే అధిక ప్రాధాన్యత నిస్తుంది.

పెళ్లయ్యాక భర్తతో కలిసి వెకేషన్స్ లో ఫుల్ గా అందాలు ఆరబోసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమంత... ఏమన్నా ప్రెస్ మీట్స్ కయినా... సినిమా ప్రమోషన్స్ కయినా అంతే అందంగా దర్శనమిస్తోంది. ఎంతగా అంటే ఎక్కడి వరకు అందాలు ఆరబోయాలో అక్కడి వరకు అందాలు ఆరబోస్తుంది. తాజాగా యు టర్న్ తో లేడి ఓరియెంటెడ్ గా హిట్ అందుకున్న సమంత మరో లేడి ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందనే న్యూస్ నడుస్తుంది. అది కూడా సురేష్ ప్రొడక్షన్ లో ఉండబోతుందట. ఇక ప్రస్తుతం వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్న సమంత... తన పెళ్లి రోజు అంటే అక్టోబర్ 6 న నాగ చైతన్యతో కలిసి శివ నిర్వాణ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానుంది.

ప్రస్తుతం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు... రెగ్యుల‌ర్ స్టోరీలున్న సినిమాలకు కాస్త విరామం ఇచ్చి....  ఇప్పుడు పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పై దృష్టి పెట్టాలని సమంత భావించినట్టుగా కనబడుతుంది సమంత వ్యవహారం. అందులో భాగంగా స‌మంత నందినిరెడ్డి క‌థ‌కు ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. వీరిద్ద‌రి కాంబోలో త్వ‌ర‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న‌ట్టు టాలీవుడ్ టాక్‌. ఇక సమంత లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంటుంది అంటే ఇక గ్లామర్ పాత్రలకు బై బై చెప్పినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే కోలీవుడ్ లో నయనతారకి లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో ఎంత క్రేజొచ్చిందో.. స్టార్ హీరోల సరసన అంతే క్రేజుంది. కారణం నయన్ కి ఇంకా పెళ్లి కాలేదు కనక. కానీ సమంత మాత్రం ఒకసారి లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంటే ఆమెకి గ్లామర్ పాత్రలు రావడం కాస్త కష్టమే.

Samantha Interests on Lady Oriented Movies:

Samantha good bye to Glamour roles

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ