ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఓ దూరదృష్టి ఉన్న దార్శనికుడు. తనదైన విజన్‌తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని, నేటి అమరావతి సమేత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై అనుక్షణం అంకుఠీత దీక్షతో పనిచేస్తున్నారు. ప్రజా నాయకుడిగా ఆయన తన మార్క్ పరిపాలనతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను సంపాదించారు. దానికి నిదర్శనమే ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం. ఈ శుభ తరుణంలో బాబు బయోపిక్ ‘చంద్రోదయం’లోని ఆయన పాత్ర లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.వి.కె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుగారి పాత్రలో నటిస్టోన్న వినోద్ నువ్వుల లుక్‌ను విడుదల చేశాము. ‘చంద్రోదయం’ చిత్రీకరణ పూర్తయింది. నారావారి పల్లె, తిరుపతి, హైదరాబాద్ ,అమరావతి, సింగపూర్ వంటి లొకేషన్స్‌లో షూటింగ్ చేశాము. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అణువణువునా ఆయన మార్క్ మనకు కన్పిస్తూనే ఉంటుంది. అలాంటి మహా నాయకుడి బయోపిక్‌ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాము. అక్టోబర్‌లో పాటలను, వెనువెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..’’ అని అన్నారు.
దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడుగారు ఓ లివింగ్ లెజెండ్. దేశ చరిత్రలోనే ఆయనొక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అగ్ర స్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో ‘చంద్రోదయం’ను తెరమీదకు తీసుకువస్తున్నాము. చిత్రీకరణ చివరి దశలో ఉంది. వినోద్ నువ్వుల చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు..’’ అని తెలిపారు.
వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక, భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్- మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.వి.కె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.