Advertisementt

నాగ్ పీకిన క్లాస్‌.. నానికి కూడానా..?

Tue 25th Sep 2018 02:18 PM
nagarjuna,nani,smartphone,users,nagarjuna,reveale,nani secret  నాగ్ పీకిన క్లాస్‌.. నానికి కూడానా..?
Nagarjuna Reveales Nani's Secret నాగ్ పీకిన క్లాస్‌.. నానికి కూడానా..?
Advertisement

తాజాగా నాగార్జున కార్తితో కలిసి 'ఊపిరి' చిత్రం చేసిన తర్వాత మరో యంగ్‌ తెలుగు స్టార్‌ నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి 'దేవదాస్‌' అనే మల్టీస్టారర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న విడుదలకు సిద్దమవుతోన్న ఈ చిత్రాన్ని 'భలే మంచిరోజు, శమంకమణి' చిత్రాల ఫేమ్‌, యంగ్‌ డైరెక్టర్‌ శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జునతో పెద్దగా హిట్స్‌లేని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్‌ 'మహానటి' తర్వాత దీనిని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో ప్రస్తుతం యూనిట్‌ బిజీగా ఉంది. ఇక తాజాగా నాగార్జున మాట్లాడుతూ, తెలుగు ఇండస్ట్రీలో 'అర్జున్‌రెడ్డి, మహానటి, ఆర్‌ఎక్స్‌ 100, గూఢచారి' వంటి సినిమాలు విజయవంతం కావడంపై హర్షం వ్యక్తచేశాడు. కాగా థియేటర్లలలో చిత్రాలను కుటుంబ సమేతంగా చూసే సినిమాలు రావడం లేదనే విమర్శపై నాగ్‌ సరిగ్గా స్పందించాడు. 

ఆయన మాట్లాడుతూ, కుటుంబంతో కలిసి చూడలేమని భావించే చిత్రాలకు పిల్లలను తీసుకొని పోవడం మానుకోవాలి. మంచి సినిమా వచ్చినప్పుడే థియేటర్లకు వెళ్లండి. ప్రస్తుతం పెద్దలు, పిల్లలకు సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ ఫోన్లకు కూడా ఇచ్చేస్తున్నారు. పిల్లలు వాటిల్లో ఏమి చూస్తున్నారనే దానిపై కూడా నిఘా పెట్టడం లేదు. అలాంటి వారే సినిమాల విషయానికి వచ్చేసరికి ఈ చిత్రాల వల్లనే పిల్లలు చెడిపోతున్నారని వాపోతున్నారు. ఇది సరికాదు. ఇటీవల విడుదలైన 'అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌100, మహానటి, గూఢచారి, చిలసౌ' వంటి చిత్రాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా 'సమ్మోహనం' చిత్రంలోని పాటలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇలాంటి విభిన్న చిత్రాలన్నింటిని ప్రేక్షకులు బాగా ఆదరించారు. దానినే మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం తెలుగులో మంచి నాణ్యమైన, విభిన్న చిత్రాలు వస్తున్నాయి.. అంటూ వ్యాఖ్యానించాడు. 

ఇదే సమయంలో ఆయన 'దేవదాస్‌'లో తనతో పాటు నటించిన నాని గురించి కూడా ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. నానికి కూడా సెల్‌ఫోన్ల పిచ్చి ఎక్కువ. నాని ఫోన్ల పిచ్చోడు. నానికి ఫోన్‌ చూడటం అలవాటుగా మారిపోయింది. అందులో ఏం చూస్తాడో నాకైతే తెలియదు. పక్కనే అందమైన అమ్మాయిలు ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా ఫోన్‌ చూస్తూ ఉంటాడు. ఫోన్‌లో గంటలు గంటలు గడిపే దాస్‌ ('దేవదాస్‌'లో నాని పేరు) నాకు చిరాకు తెప్పింస్తుంటాడు. మీకు చిరాకు తెప్పించే స్నేహితుడు ఎవరైనా ఉంటే ట్యాగ్‌ చేయండి అంటూ చెప్పుకు రావడం విశేషం. తెలుగులో శర్వానంద్‌ మామూలు ఫోన్‌ తప్ప స్మార్ట్‌ ఫోన్లంటే చిరాకుపడే మనస్తత్వం, మరి నాని చూస్తే దానికి పూర్తి వ్యతిరేకంగా అనిపిస్తున్నాడు. 

Nagarjuna Reveales Nani's Secret:

Nagarjuna Class to Smart Phone Users

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement