టాలీవుడ్ లో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'ఎన్టీఆర్' బయోపిక్ రోజురోజుకి అంచనాలు పెంచేస్తుంది. క్రిష్ - బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావటం..దానికి తోడు ఇండియా మొత్తం పాపులర్ అయిన నటుడు సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ కావడంతో అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది.
స్టార్ట్ చేయడమే కాదు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలుతో పాటుగా కృష్ణాజిల్లాకు రూ. 11.40 కోట్లకు సాయి కొర్రపాటి థియేట్రికల్ రైట్స్ డీల్ సెట్ చేసుకున్నట్టు సమాచారం. బాలయ్య కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా బిజినెస్ జరుగుతుంది. ఈ రేషియో ప్రకారం ఆంధ్రా రైట్స్ 30 కోట్లు.. సీడెడ్ 12 కోట్లు.. నైజాం 18 కోట్లకు అమ్మాల్సి ఉంటుంది. ఒక్క సీడెడ్ మినహాయిస్తే మిగిలిన ఏరియాస్ అన్ని ఆ రకంగా పలకడం గొప్ప విషయమే.
అయితే 'ఎన్టీఆర్' నిర్మాతలు 'బాహుబలి' బిజినెస్ అప్పుడు రాజమౌళి ఏ ప్లాన్ ను ఫాలో అయ్యాడో అదే ప్లాన్ ఫాలో అవుతున్నారు. సాయి కొర్రపాటి భారీ రేట్లకు కొన్నాడని లీకులిస్తూ మిగతా ఏరియాలకు భారీ రేట్ ను కోడ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సిఉంది. ఇది ఇలా ఉంటే కొంతమంది మాత్రం ఎన్టీఆర్ మీద బయోపిక్ కాబట్టి క్రేజ్ చాలా ఎక్కువగా ఉందని.. సంక్రాంతి టైంలో ఈజీగా కలెక్షన్స్ వచ్చేస్తాయని.. ఈ సినిమాలో కాస్టింగ్ కూడా చాలా పెద్దదిగా ఉందని అంటున్నారు. సో ఆ రేట్స్ సరైనవే అంటున్నారు.