టాలీవుడ్ లో నటించిన ముకుంద, ఒక లైలా కోసంలో చాలా ట్రెడిషనల్ గా అంటే మడి కట్టుకుని కూర్చున్న పూజ హెగ్డే డీజే దువ్వాడ జగన్నాధం సినిమాలో బికినీ షో కి కేక పుట్టించింది. ఒకే ఒక్క బికినీ సీన్ పూజ హెగ్డే ని లక్కీ గర్ల్ చేసేసింది.. అని మనం డీజే సినిమా విడుదలైనప్పటి నుండి భజన చేస్తూనే ఉన్నాం. డీజే సినిమాలో మిగతా సీన్స్ లో ట్రెడిషనల్ డ్రెస్సులతో అందాలు దాచుకున్న పూజ హెగ్డే అల్లు అర్జున్ తో కలిసి డాన్స్ ల విషయంలో కానీ, స్విమ్మింగ్ పూల్ దగ్గర పూజ వేసిన బికినీ గాని ఆమెని స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు దోహదపడ్డాయి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలోనూ పూజ హెగ్డే అందమైన లుక్స్ తో దర్శనమిచ్చింది. ట్రెడిషనల్ అండ్ గ్లామర్ తోనూ అదరగొట్టిన పూజకి ఆ సినిమా ప్లాప్ అయ్యింది.
అయితే డీజే లో వేసిన స్విమ్ డ్రెస్సుకి పూజ హెగ్డేకి విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అందుకే తన తదుపరి దర్శకులు కూడా పూజతో బికినీ షో చేయించాలని డిసైడ్ అయ్యారనే టాక్ వినబడుతుంది. త్రివిక్రమ్ సినిమాల్లో ఈ మధ్యన హీరోయిన్స్ ని కాస్త హాట్ గా చూపెట్టడం చేస్తున్నాడు. సన్ అఫ్ సత్యమూర్తి, అ.. ఆ సినిమాల్లో సమంతని కాస్త హిట్ గర్ల్ గానే చూపెట్టాడు. తాజాగా అరవింద సమేతలో పూజ హెగ్డేని కూడా త్రివిక్రమ్ సూపర్ హాట్ గా చూపెట్టబోతున్నాడంట. అది కూడా పూజ హెగ్డేతో బికినీ షో చేయించబోతున్నాడట. అది కూడా ఓ ఐదు నిమిషాల పాటు పూజ బికినీ షో అరవింద సమేతలో ఉండబోతోందనే టాకే ఫ్యాన్స్ ని గిలిగింతలు పెట్టించేస్తుంది.
మరి దసరా టార్గెట్ గా రాబోతున్న అరవింద సమేత సినిమాలో చివరి సాంగ్ షూటింగ్ కోసం త్రివిక్రమ్ అండ్ పూజ, ఎన్టీఆర్ లు ఇటలీ వెళ్లారు. రేపో మాపో ఆ సాంగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకచకా కానిచ్చేసి... సినిమా ప్రమోషన్స్ ని కూడా మొదలెట్టేసి దసరాకి సినిమా విడుదలకు సిద్ధం చేస్తారట. మరోపక్క అరవింద సమేత లీక్డ్ సీన్స్ అరవింద టీంకి ఒణుకు పుట్టిస్తున్నాయి. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుని ఈసారి సినిమా విడుదలయ్యే వరకు ఎటువంటి లీక్స్ జరక్కుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారట టీం సభ్యులు.