Advertisementt

‘గీత..’ని చూపిస్తూ ‘నోటా’కి మండిస్తున్నారట!

Tue 25th Sep 2018 12:01 AM
vijay deverakonda,nota,nizam area,rights,distributors  ‘గీత..’ని చూపిస్తూ ‘నోటా’కి మండిస్తున్నారట!
Nota Producers Shocks Distributors ‘గీత..’ని చూపిస్తూ ‘నోటా’కి మండిస్తున్నారట!
Advertisement
Ads by CJ

'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ కొండత పెరిగితే.. 'గీత గోవిందం' తో ఆకాశమంత పెరిగిపోయింది. 'అర్జున్ రెడ్డి' లో రఫ్ అండ్ టఫ్ స్టూడెంట్ గా, డాక్టర్ గా ఇరగదీసిన విజయ్ దేవరకొండ, 'గీత గోవిందం' సినిమాలో అమాయకమైన సాఫ్ట్ వేర్ కుర్రాడిలా నటించి ఇరగదీశాడు. మరి తమిళనాట తెరకెక్కిన 'నోటా' సినిమాలో పొలిటిషన్ గా అదరగొడుతున్నాడు. 'గీత గోవిందం' తో 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో తర్వాతి సినిమాలపై అదే రకమైన క్రేజ్ ఉంటుంది... కాదు కాదు ఉండాలి. కాకపోతే 'గీత గోవిందం' కామెడీ టచ్ తో విజయ్ చేసిన అమాయకమైన కామెడీకి, రష్మిక యాక్టింగ్ కి పరశురామ్ డైరెక్షన్ స్కిల్స్ కి.... అన్ని అన్ని ఓవరాల్ గా సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక 'గీత గోవిందం' ఎవ్వరూ ఊహించని హిట్ అయ్యింది. కనీసం ఆ సినిమాని నిర్మించిన నిర్మాతలే ఆ సినిమా ఆ రేంజ్ హిట్ అంటే నమ్మలేకపోయారు.

ఇక 'గీత గోవిందం' సినిమా నైజాంలో రఫ్ ఆడించింది. నైజాంలో ఏకంగా 20 కోట్లు కొల్లగొట్టి, ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్', చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాలకు షాకిచ్చింది. అయితే 'గీత గోవిందం' కథ వేరు, ఇప్పుడొస్తున్న విజయ్ 'నోటా' కథ వేరు. 'నోటా' సినిమా మొత్తం పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కింది. మరా సినిమా కంటెంట్ ఎలా ఉంటుందో సరైన క్లారిటీ ఎవరికీ లేదు. ఇకపోతే రేపు అక్టోబర్ 5 న విజయ్ దేవరకొండ నటించిన ద్విభాషా చిత్రం 'నోటా' విడుదల కాబోతుంది. నిన్నటివరకు విడుదల కన్ఫ్యూజన్ లో ఉన్న 'నోటా' తాజాగా విడుదల డేట్ సెట్ చేసుకున్నాక సినిమా  బిజినెస్ ఊపందుకుంది. సరైన ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయకముందే.. 'నోటా' నిర్మాత జ్ఞానవేల్ రాజా 'నోటా' సినిమాకి దిమ్మతిరిగే రేట్లు చెబుతున్నాడట. 

అందులో మరీ ముఖ్యంగా నైజాంలో కళ్ళు బైర్లుగమ్మే రేటు చెప్పి బయ్యర్లకు దడ పుట్టించాడనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. విజయ్ క్రేజ్ నైజాంలో 'గీత గోవిందం' తో బయటపడడంతో.. 'నోటా' సినిమాకి ఏకంగా 16 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట 'నోటా' నిర్మాత. అమ్మో అంతా అని డిస్ట్రిబ్యూటర్ అడిగితే విజయ్ దేవరకొండ గత చిత్రం 'గీత గోవిందం' 20 కోట్లు తెచ్చింది కదా మాకు తెలియదనుకున్నారా అని అంటున్నాడట. మరి విజయ్ మీద ఎంత క్రేజున్న కంటెంట్ ని బట్టే ఆ సినిమాకి రేటు పలుకుతుంది. అందుకే నైజాం బయ్యర్లు ఇలా 'గీత గోవిందం' తో నోటాని పోలిస్తే కష్టం బాబు అంటూ చేతులెత్తేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది.

Nota Producers Shocks Distributors:

Shocking Price to NOTA Nizam Area Rights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ