తమిళ సీనియర్ నటుడు విజయ్‌కుమార్‌కి మంచి పేరుంది. ఆయన రెండు వివాహాలు చేసుకున్నాడు. ఇది సినిమా వారికే కాదు.. నేడు అందరికీ సహజంగా మారింది. ఇక ఈయన మొదటి భార్య కుమార్తె వనిత. ఈమె తెలుగులో కూడా ‘దేవి’ చిత్రంలో నటించింది. విజయ్‌కుమార్ కుమార్తెలైన శ్రీదేవి, ప్రీతిలకు, ప్రముఖ నటుడు, తెలుగులో కూడా ‘బ్రూస్‌లీ’ చిత్రంలో విలన్‌గా నటించి, ప్రస్తుతం ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న అరుణ్ విజయ్‌లకి కూడా మంచి పేరుంది. పంచాక్షరి రంగస్వామి అనే అసలు పేరున్న విజయ్‌కుమార్ నటునిగానే కాదు రాజకీయ నాయకుడు కూడా. ఇక ఈయన మరో కూతురైనా వనితది మొదటి నుంచి వివాదాల జీవితమే. పిల్లల విషయంలో, మూడు పెళ్లిళ్లు చేసుకుని, భర్తలను ఆస్తుల కోసం మోసం చేసిన ఘనత ఆమెది.
ఇక విషయానికి వస్తే తాజాగా తన నుంచి ఇంటిని షూటింగ్ కోసం అద్దెకు తీసుకుని, ఇంటిని ఖాళీ చేయకుండా తనని బెదిరిస్తోందని విజయ్‌కుమార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తప్పు ఎవరిది అనేది పక్కనపెడితే తండ్రి కూతురిపై చేసిన ఆరోపణలను విచారించే నిమిత్తం పోలీసులు, అధికారులు వనిత వద్దకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా కూడా అక్కడకు చేరింది. అక్కడ మీడియా వారి కెమెరాలను నేలకేసి కొట్టి, వచ్చిన అధికారులపై ఆమె దాడి చేసింది. దీంతో పోలీసులు ఆమెని వెతుకుతున్న క్రమంలో వడపళని స్టేషన్‌లో వనిత ప్రత్యక్ష్యం అయింది. తన తండ్రి తనపై కిరాయి రౌడీలను పంపించాడని, అధికారులు, పోలీసుల వేషాలలో వచ్చిన వారందరు తన తండ్రి పంపిన కిరాయి గూండాలేనని ఆమె ఫిర్యాదు చేయడం విశేషం.
బలవంతంగా తనను అర్ధరాత్రి ఇంట్లో నుంచి గెంటివేశారని, ప్రస్తుతం తాను తన తల్లితో పాటు ఉంటున్నానని, కన్నకూతురని చూడకుండా ఇంటి నుంచి గెంటించివేశాడని తన తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది. సినిమా ఆర్టిస్టుని కావడంతో తనకి ఎవ్వరూ అద్దె ఇల్లు ఇవ్వడం లేదని వాపోయింది. అంటే సినిమా వారందరికి ఎవ్వరూ ఇళ్లను అద్దెకు ఇవ్వరా? లేక కేవలం విచ్చలవిడి కలిగిన వారి విషయంలోనే ప్రజలు అలా ఆలోచిస్తారా? అనేది ఆమెకే తెలియాలి. మరి అధికారులు కిరాయిగూండాలైన అక్కడికి వచ్చి కెమెరాలు పగులగొట్టించుకున్న మీడియా వారు కూడా కిరాయి మనుషులేనా అన్న అనుమానం రాకమానదు. ఇదంతా చూస్తేంటే దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.