ఉపాసన మెగా ఇంటి కోడలు అయ్యాక.. మెగా ఫ్యాన్స్‌కి మెగా ఫ్యామిలీ ముచ్చట్లు, మెగా హీరోల సినిమాలను సోషల్ మీడియా వేదికగా తెగ ప్రమోట్ చేస్తుంది. ప్రమోషన్ అనే కన్నా అభిమానులతో ఉపాసన మెగా ఫ్యామిలీ గురించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. మామగారైన మెగాస్టార్ చిరంజీవి గురించి, భర్త చరణ్ గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు రిపోర్ట్ చేస్తుంటుంది. మరి మెగా కోడలుగా ఆ మాత్రం బాధ్యతలు సహజమే కదా. ఇక ఉపాసన భర్త చరణ్ ని మిస్టర్ సి అంటూ ముద్దుగా పిలుచుకుంటుంది. మరి మిస్టర్ సి ఫిట్నెస్, ఆహారనియమాలు, షాపింగ్స్ వివరాలు, వంట చేసే విషయాలను ఫొటోలతో సహా ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
తాజాగా మామ చిరు, ఆడపడుచు సుష్మిత, భర్త చరణ్ తో డిన్నర్ డేట్ ని ఎంజాయ్ చేసిన ఉపాసన.. ఇప్పుడు భర్త తనకి ఎంతో ప్రేమగా తినిపించిన ఫొటోస్ ని షేర్ చెయ్యడమే కాదు.. ఆ ఫొటోతో పాటుగా ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. అదేమిటంటే... మంచి రుచికరమైన వంటలు బలవంతంగా నైనా తినిపిస్తాడు మిస్టర్ సి. అంటూ.. లవ్ సింబల్ పెట్టడమే కాదు.. ఆతర్వాత ఫన్నీగా ‘ప్రేమగా పెట్టడమే కాదు తర్వాత జిమ్‌కు తీసుకెళ్లి తిన్నది అరిగిందాకా చంపుతాడు..’ అని శాడ్ సింబల్ కూడా పెట్టింది ఉపాసన. ఇక మిస్టర్ సి తో ఈ ఆదివారం అద్భుతంగా గడిచింది అంటూ ఎంతో ప్రేమతో రెండు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మరి భర్త తో ఉన్న ఇటువంటి ఆనంద క్షణాలను ఎంతో ప్రేమగా ఇలా అభిమానులతో పంచుకునే మెగా కోడలు ఉపాసన గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు మెగాభిమానులు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను తో కలిసి RC12 యాక్షన్ సీక్వెన్స్ కోసమే బాగా జిమ్ చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో భరత్ భామ కియారా అద్వానీ.. రామ్ చరణ్ తో జోడి కడుతుంది.