నేడున్న యంగ్ దర్శకుల్లో పరుశురాం ఒకరు. ఈయన మంచి రచయిత కూడా. మొదట్లో పూరీజగన్నాధ్ నుంచి పలువురి వద్ద ఎన్నో చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. ఇక ఈయన దర్శకునిగా మారి నిఖిల్ హీరోగా 'యువత' రవితేజతో 'ఆంజనేయులు', 'సారొచ్చారు, సోలో, శ్రీరస్తు శుభమస్తు' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో 'సోలో', 'సారొచ్చారు' తప్ప మిగిలిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. కానీ ఆయనకు రావాల్సినంత క్రేజ్ రాలేదు. వీటన్నింటికి కలిపి ఆయన 'గీతగోవిందం'తో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరాడు. 'గీతగోవిందం' చిత్రం విజయంలో పరుశురాంది కూడా ముఖ్యమైన పాత్ర.
ఇక తాజాగా ప్రముఖ దిగ్గజ దర్శకుడు, రచయిత, నటుడు అయిన పరుచూరి గోపాలకృష్ణ ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూస్తే దర్శకుడు స్క్రీన్‌ప్లే విషయంలో ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉన్నాడో, స్క్రీన్‌ప్లేని ఎంత పర్‌ఫెక్ట్‌గా ఫాలో అయ్యాడో అర్ధమవుతోంది. హీరోయిన్‌తో కలిసి హీరో బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల నిద్రలో ఉన్న హీరోయిన్‌కి లిప్‌కిస్ ఇచ్చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి లేచి చెంప పగులకొట్టడం, వాళ్ల అన్నయ్యకి ఫోన్ చేయడం జరిగిపోతాయి. హీరో ఆ అమ్మాయితో బస్సు దిగుతాడు. ఆ హీరో వాళ్ల అన్నయ్య వచ్చి హీరోని చితక గొడుతాడు అని అందరు భావిస్తారు.
కానీ మనం ఎవ్వరూ ఊహించని విధంగా బస్సు అద్దాలను పగులగొట్టుకుని దూకేస్తాడు. ఈ కథనం ఎంతో కొత్తగా అనిపిస్తుంది. ఆ వెంటనే మరో పెద్ద ట్విస్ట్ ఇవ్వడంతో అందరిలో మరింత ఆసక్తి కలుగుతుంది. ఏ హీరోనైతే కొడదామని హీరోయిన్ అన్నయ్య అనుకుంటాడో ఆ హీరో చెల్లెలినే, హీరోయిన్ అన్నయ్య పెళ్లి చేసుకోబోతున్నాడని ట్విస్ట్ ఇచ్చాడు. ఇలా అందరిలో ఉత్కంఠను పెంచుకుంటూ వెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.. అంటూ పరుశురాంపై పరుచూరి ప్రశంసల వర్షం కురిపించాడు.