Advertisementt

తప్పు చేస్తున్నావ్.. కీర్తిసురేష్..!

Sat 22nd Sep 2018 02:05 PM
keerthy suresh,sasikumar,simbu,prabhakaran,venkat prabhu,mahanati  తప్పు చేస్తున్నావ్.. కీర్తిసురేష్..!
Keerthy Suresh to romance Simbu and not Sasikumar? తప్పు చేస్తున్నావ్.. కీర్తిసురేష్..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్లలో కీర్తిసురేష్‌ది ప్రత్యేకమైన స్థానం. బాలనటిగా పలు మలయాళ చిత్రాలలో నటించిన ఆమె ఆ తర్వాత లీడ్‌ హీరోయిన్‌ పాత్రలు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత తమిళంలో శివకార్తికేయన్‌, బాబీసింహా, ధనుష్‌, విజయ్‌ వంటి స్టార్స్‌తో కలిసి నటించింది. తెలుగులో రామ్‌ హీరోగా రూపొందిన 'నేను శైలజ' చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేసింది. టాలీవుడ్‌లో నానితో 'నేను లోకల్‌', పవన్‌కళ్యాణ్‌ 'అజ్ఞాతవాసి'లలో నటించిన ఈమె నటనా ప్రతిభకు నిలువుటద్దంగా సావిత్రి బయోపిక్‌గా రూపొందిన 'మహానటి' నిలిచింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అత్యద్భుతమైన విజయం సాధించింది. పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా, స్టార్‌ చిత్రాలలో కూడా గ్లామర్‌ పేరుతో అందాల ప్రదర్శనకు విరుద్దమైన ఈమె ప్రస్తుతం తెలుగులో 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో తమిళంలో శివకార్తికేయన్‌, సమంతలు నటిస్తున్న 'సీమరాజా', విక్రమ్‌ హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న 'సామి' సీక్వెల్‌, లింగుస్వామి దర్శకత్వంలో విశాల్‌ సూపర్‌ హిట్‌ చిత్రం, విశాల్‌ 25వ ప్రతిష్టాత్మకమైన 'పందెంకోడి 2'లో యాక్ట్‌ చేస్తోంది. 

ఇక ఈమె తమిళంలో శశికుమార్‌ హీరోగా ప్రభాకరన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఒప్పుకుందట. కానీ ఈ చిత్రం నుంచి ఆమె హఠాత్తుగా తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. కానీ కీర్తిసురేష్‌ మాట్లాడుతూ, తాను అసలు ఆ చిత్రంలో నటించడం లేదని చెప్పుకొచ్చింది. దీనికి ప్రధాన కారణం ఇదేనంటూ కోలీవుడ్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. 

శశికుమార్‌ చిత్రం సమయంలోనే ఆమెకి వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా రాజకీయాల నేపధ్యంలో సాగే చిత్రంలో ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర లభించడంతో ఆమె శశికుమార్‌ చిత్రం నుంచి తప్పుకొందని, ఇదే అసలైన కారణమని వినిపిస్తోంది. అయినా మంచి చిత్రాన్ని వదులుకోమని ఎవ్వరూ చెప్పరు గానీ ముందుగా ఒప్పుకున్న చిత్రం నుంచి హఠాత్తుగా వైదొలిగితే నిర్మాతలకు ఎంత నష్టం అనేది ఓ నిర్మాత కూతురయిన ఈమె పట్టించుకోకపోవడం మాత్రం సబబు కాదనే చెప్పాలి. 

Keerthy Suresh to romance Simbu and not Sasikumar?:

Keerthy Suresh clarifies about playing lead role in Sasikumar’s upcoming film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ