Advertisementt

పిక్: మెగా ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు

Sat 22nd Sep 2018 01:29 PM
chiranjeevi,family pic,social media,ram charan,upasana,susmitha  పిక్: మెగా ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు
Mega Fans Happy with Mega Pic పిక్: మెగా ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు
Advertisement
Ads by CJ

బోయపాటి శ్రీను - రామ్ చరణ్ లు RC12 సినిమా షూటింగ్ ని చకచకా కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం అజర్ భైజాన్ అనే అరుదైన లొకేషన్ లో RC12  సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అజర్ భైజాన్ షూటింగ్ స్పాట్ లో తెరకెక్కించే యాక్షన్ సీక్వెన్సెస్ RC12 కే పవర్ ఫుల్ అండ్ కీలక సన్నివేశాలుగా ఎప్పటినుండో చెబుతున్నారు. అయితే అక్కడ అజర్ భైజాన్ లొకేషన్స్ లో రామ్ చరణ్ తో పాటుగా ఆయన భార్య ఉపాసన కూడా సందడి చేస్తుంది. అక్కడి విశేషాలను ... రామ్ చరణ్ షాపింగ్ విశేషాలతో పాటుగా... రామ్ చరణ్ చేసే జిమ్ తో పాటుగా ఆ లొకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ తాము దిగిన ఫొటోస్ ని ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెగా అభిమానులను ఉత్సాహపరుస్తుంది.

ఇకపోతే రామ్ చరణ్ సినిమాలకు ఆయన తండ్రి చిరు సినిమాలకు చిరు పెద్ద కూతురు సుష్మితనే కాస్ట్యూమ్ డిజైనర్. అయితే రామ్ చరణ్ షూటింగ్ స్పాట్ తో పాటుగా చిరు సై రా సినిమా షూటింగ్ స్పాట్ లోనూ సుస్మిత ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం చరణ్ RC 12 షూటింగ్ స్పాట్ లోనే సుస్మిత స్పెండ్ చేస్తుంది. ఇక తాజాగా నిన్న చిరంజీవి కూడా రామ్ చరణ్ - బోయపాటి షూటింగ్ జరిగే అజర్ భైజాన్ షూటింగ్ స్పాట్ కి వచ్చి అందరికి షాకిచ్చాడు. కొడుకు షూటింగ్ కి హాజరైన చిరంజీవి ఆక్కడి షూటింగ్ లొకేషన్ లో సందడి చెయ్యడమే కాదు.. కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుష్మిత, అల్లుడు తో పాటుగా డిన్నర్ డేట్ లో మెరిశాడు. మెరవడమే కాదు. కూతురు కొడుకు, కోడలు, అల్లుడుతో చిరు ఎంజాయ్ చేస్తూ తీసిన ఫోటోని ఉపసన సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం... అది రామ్ చరణ్ షేర్ చేయడం అబ్బో ఆ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లోకొచ్చేసింది.

మెగా ఫ్యామిలీలో నుండి ఏ పిక్ బయటికొచ్చిన అదే ట్రెండింగ్ లో ఉంటుంది. కానీ ఏది ఏమైనా ఈ ఫోటో మాత్రం మెగా ఫాన్స్ నే కాదు మిగతా ప్రేక్షకులను ఖుషి చేస్తుంది. ఇక ఆ పిక్ లో చిరు మాత్రం ఉత్సాహంగా సన్నగా అంటే స్లిమ్ గా కనబడుతున్నాడు. కూతురు కోడలు మీద చెయ్యేసే హ్యాపీగా ఉన్న చిరు చూస్తుంటే అప్పుడే చిరు కి 60 ఏళ్లు దాటేశాయా అనుకోకమానరు. ఇక ఆ ఫోటోలో వారంతా బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. దానికి కూడా ఉపాసన.. డిన్నర్ డేట్స్ విత్ బ్లాక్ డ్రెస్ కోడ్ అంటూ మెంక్షన్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఆ మెగా పిక్ వైరల్ అయ్యింది.

Mega Fans Happy with Mega Pic:

Chiranjeevi Family pic Sensation in Social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ