Advertisementt

రానా అనకుండానే రాసేశారట!

Sat 22nd Sep 2018 12:20 PM
rana daggubati,disappointed,national,media,article  రానా అనకుండానే రాసేశారట!
Rana Daggubati on National Media Stories రానా అనకుండానే రాసేశారట!
Advertisement
Ads by CJ

మీడియా వేగంగా తన విశ్వసనీయత కోల్పోతోంది. కేవలం లాభాలు, మీడియా ద్వారా ప్రయోజనాలు పొందడం, పార్టీకి, నాయకుడు, స్థితిమంతుడికో మీడియా వస్తూ ఉండటం, ఒకే వార్తను ఎవరి అనుకూలంగా వారు రాసుకుని నిర్వచించుకోవడం మొదలైంది. నిజమైన వార్తను అందించే కంటే అందరి కంటే ముందు తామే అందించాలనే తపన వల్ల జర్నలిజం పతనావస్తకు చేరుకుని విశ్వసనీయత కోల్పోతోంది. ఇది ఏదో అనామక పత్రికలు, చానెల్స్‌లోనే కాదు.... జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న పత్రికలు, చానెల్స్‌ కూడా దీని బారిన పడుతున్నాయి. 

గతంలో జర్నలిజంపై ఓ జోక్‌ ఉండేది. విదేశాలకు చెందిన క్రిస్టియన మరియు మత పెద్ద మన దేశానికి వచ్చాడట. మాటల్లో జర్నలిస్ట్‌లు బార్లు, మద్యం వంటి అంశాలు ప్రస్తావించడంతో ఆశ్చర్యపోయిన ఆ మత పెద్ద ఇంత గొప్ప ఆధ్మాతిక దేశంలో కూడా బార్లు ఉన్నాయా? అని అడిగాడట. కానీ తెల్లారి చూస్తే పత్రికల్లో 'ఇండియాలో బార్లు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించిన మత పెద్ద పేరుతో వార్తలు కనిపించాయట. అంటే మీడియా సెన్సేషన్‌ కోసం, లేదా సరిగా వినకుండా, హడావుడిగా ఇలా ఎలా తప్పు జరిగినా అది పూర్తిగా ఇతరులపై ప్రభావం చూపుతుంది. 

ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో కూడా క్రేజ్‌ తెచ్చుకున్న నటుడు భళ్లాలదేవ రానా. ఈయనకు ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్‌ ఉంది. ఆయన నటించే చిత్రాలకు దేశవ్యాప్తంగా బిజినెస్‌ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా బాలీవుడ్‌పై ఇంట్రస్ట్‌ లేదు అని వ్యాఖ్యలు చేయరనేది నిజం. కానీ రానా అనని మాటలను ఓ జాతీయ పత్రిక అన్నట్లుగా ప్రచురించింది. ఆ ఇంటర్వ్యూలో తాను చెప్పింది ఒకటైతే, ప్రచురించింది వేరని రానా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ, నేను చెప్పింది మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు సరిగా వినినట్లు లేదు. నాకు బాలీవుడ్‌లో ఏది ఇంట్రస్టింగ్‌గా అనిపించడం లేదని నేను అనలేదు. కానీ దానిని అలా ప్రచురించారు.. అంటూ తన ఆవేదన తెలిపాడు. 

Rana Daggubati on National Media Stories:

Rana Disappointed with National Media Article

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ