మనదేశంలో వివాహ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. మన వారు పెళ్లిళ్లు భూలోకంలో కాదు... స్వర్గంలో నిర్ణయమవుతాయని నమ్ముతారు. ఎవరికి ఎవరిని దేవుడు ముడిపెడతాడో.. ఏంటో ఎవ్వరికి అర్ధం కాదు.. అందుకే మన పెద్దలు కూడా మోటుగా ‘కళ్యాణం వచ్చినా..కక్కోచ్చినా ఆగదంటారు. సముద్రంలోని ఉప్పుకి, గట్టు మీద చెట్టుకి ముడివేయడం ఆ భగవంతుని నిర్ణయం’. ఇదే విషయం నాగచైతన్య, సమంతలకి వర్తిస్తుంది. ఎక్కడ నాగచైతన్య? ఎక్కడ సమంత? ఇద్దరికీ ఆ దేవుడు నిజంగానే ముడిపెట్టిఉన్నాడని అర్దమవుతుంది.
ఏదో పాకెట్ మనీ కోసం మోడలింగ్‌లోకి అడుగుపెట్టి, ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదవాలని భావించిన సమంత అనుకోకుండా హీరోయిన్ అయింది. ఓ సంప్రదాయ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన ఆమెకి సినీ చరిత్రతో విడదీయరాని బంధం ఉన్న దేశంలోని ముఖ్య ఫ్యామిలీలలో ఒకటైన అక్కినేని ఇంటి కోడలు అవ్వడం విధి విచిత్రం. మొదటి చిత్రంలో ఎవరితో అయితే రొమాన్స్ చేసి వెండితెరపై ఆకట్టుకుందో అదే యువతి అదే యువకునికి భార్యగా మారింది.
ఇక తాజాగా సమంత నాగచైతన్యతో తన పరిచయం గురించి చెబుతూ, చెన్నై కాలేజీలో చదువుకుంటూనే పాకెట్‌మనీ కోసం మోడలింగ్ చేసేదానిని. పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనేది నా డ్రీమ్. కానీ ఏడాది పాటు గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో నేను సినిమాలలోకి రావడం జరిగింది. తెలుగులో ‘ఏమాయ చేశావే’ షూటింగ్ సమయంలోనే నాగచైతన్యతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. గౌతమ్‌మీనన్ గారు పెద్ద దర్శకులు. నాకేమో నటన కొత్త. తెలుగు రాదు. పైగా డైలాగ్స్ చాలా పెద్ద పెద్దవి ఉండటంతో ఎంతో భయపడిపోయాను. ఆ సమయంలో చైతూ నా భయం పోగొట్టాడు. దాంతో మా మధ్య స్నేహం మరింతగా బలపడింది అని చెప్పుకొచ్చింది. అంటే ఆస్ట్రేలియాకి వెళ్లడానికి వచ్చిన ఏడాది గ్యాపే సమంత, చైతుల పరిచయానికి బీజం వేసిందనేది అర్ధమవుతోంది.