Advertisementt

భరత్ రెడ్డి.. బాలయ్య అంటూ ఇరుక్కున్నాడుగా?

Fri 21st Sep 2018 05:00 PM
bharat reddy,balakrishna,sensational comments,balayya  భరత్ రెడ్డి.. బాలయ్య అంటూ ఇరుక్కున్నాడుగా?
Bharat Reddy Praises Balakrishna భరత్ రెడ్డి.. బాలయ్య అంటూ ఇరుక్కున్నాడుగా?
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణని అభిమానించే వారు ఉన్నారు విమర్శించేవారు కూడా ఉన్నారు. మాస్ లో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది.  కాకపోతే అప్పుడప్పుడు ఫ్యాన్స్ మీద చెయ్యి చేసుకోవడం.. నోటికి ఏది వస్తే అదే మాట్లాడటం వంటివి చేస్తారని కొంతమంది ఆయన్ను తీవ్రంగా విమర్శించేవారు ఉన్నారు. అలాగే అభిమానించే వారు కూడా ఉన్నారు. లేటెస్ట్ గా ఆ లిస్ట్ లోకి యాక్టర్ భరత్ రెడ్డి చేరారు.

భరత్ రెడ్డి నటుడిగానే కాదు ఆయన ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ (గుండె వైద్య నిపుణుడు) అనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఈయన ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో ఆయన బాలయ్య పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలయ్య గురించి తన మనసులో విషయాలు బయటకు చెప్పారు.

‘‘నేను చాలా తక్కువ మందిని ఎక్కువగా అభిమానిస్తాను. వారందరు స్వచ్ఛంగా ఉంటారని అనుకుంటాను. వారిలో బాలకృష్ణ గారు నెంబర్ వన్. అతనిలా ఎవరు ఉండరు. ఆయన చాలా జెన్యూన్ గా.. ముక్కుసూటిగా ఉంటారు. అలా చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో. ఆయన ఎంతో సీనియర్ అయినా ఇప్పటికే ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. సెట్స్ లో చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. సెట్స్ లో ఆయన ఉండే ఎనర్జీతో నాలాంటి నటులను సిగ్గుపడేలా చేస్తారు. అదేవిధంగా మరో హీరో అజిత్ అని కూడా చెప్పాడు భరత్. ఆయన కూడా బాలయ్యలాగా జెన్యూన్ గా ఉంటారని..చాలా కష్టపడతారు..’’ అని భరత్ చెప్పాడు.

Bharat Reddy Praises Balakrishna:

Bharat Reddy Sensational Comments on Balayya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ