తెరపై అందాల నాయకిగానే కాదు.. పలు స్వచ్ఛంధ కార్యక్రమాల విషయంలో మిగిలిన అక్కినేని ఫ్యామిలీ కంటే ఓ మెట్టుపైనే ఆ ఇంటి కోడలు సమంత ఉంటుందనేది నిజం. ఆమె పైకి షార్ట్ టెంపర్‌గా, కఠినంగా మాట్లాడుతున్నట్లు కనిపించినా అందమైన శరీరంతో పాటు అంతకంటే అందమైన మనసును దేవుడు ఆమెకి ఇచ్చాడు. కానీ ఏ విషయంలోనైనా సూటిగా, ముక్కుసూటిగా, ఎవరు ఏమనుకుంటారో? అనే ఆలోచన లేకుండా కుండ బద్దలు కొట్టడం ఆమె నైజం. ఆ విషయం మహేష్ నటించిన ‘1’(నేనొక్కడినే)లో బీచ్‌లో హీరోయిన్ పోస్టర్‌ని విమర్శించడం ద్వారా ఆమె నిరూపించుకుంది. ఈ విషయంలో పలువురు ప్రముఖులు కూడా ఆమెనే సమర్దించారు. ఇక తాను ఇకపై ‘దూకుడు’ వంటి చిత్రాలు చేయనని ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. సమాజం కోసం తన ఇష్టాయిష్టాలను మార్చుకుని బతకడం కన్నా, తన జీవితాన్ని తాను సరైనది అనే ఆలోచనలో ఆమె ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె చేస్తున్న చిత్రాలు, ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలే దానికి ఉదాహరణ.
ఇక ఈమెకి షార్ట్ టెంపర్ అన్న విషయంపై ఆమె సమాధానం ఇస్తూ.. నిజమే నాకూ అది నిజమేననిపిస్తుంది. కానీ ఈమద్యకాలంలో బాగా మారిపోయాను. నా టెంపర్‌ని మొత్తం నా భర్త నాగచైతన్య తగ్గించేశాడు. నిజం చెబుతున్నాను. ఇంట్లో పైచేయి ఆయనదే. బయట జనాలకు కనిపించేలా చైతూ ఇంట్లో ఉండడు. ఇంట్లో పరిస్థితి రివర్స్‌గా ఉంటుంది. బయట నేను ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటాను. అల్లరి పనులు చేస్తూ అల్లరి అమ్మాయి అనిపించుకుంటూ ఉంటాను. కానీ ఇంట్లో, అందునా చైతు ముందు మాత్రం సైలెంటే. ఆయన ఇంట్లో ఎంతో క్యూట్‌గా ఉంటూ ఉంటారు కనుక ఆయనను నేను ఇంట్లో ‘బేబీ’ అనిపిలుస్తూ ఉంటానని చెబుతూ నవ్వేసింది. నిజమే.. సంసారం అన్న తర్వాత ఎవరో ఒకరు సర్దుకుపోతూ సైలెంట్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఈ విషయంలో సమంతకి హ్యాట్సాఫ్ చెప్పాలి.