Advertisementt

సమంతకు అలీని పరిచయం చేసిందెవరో తెలుసా?

Thu 20th Sep 2018 05:49 PM
pawan kalyan,samantha,ali,alito saradagaa  సమంతకు అలీని పరిచయం చేసిందెవరో తెలుసా?
Samantha and Ali Funny Conversation సమంతకు అలీని పరిచయం చేసిందెవరో తెలుసా?
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌.. ఈయన తెరపై ఎంతగా రెచ్చిపోతాడో నిజ జీవితంలో అంత సిగ్గరి. అంతర్ముఖుడు. తనకి ఆర్టిఫిషయల్‌గా ఉండే డ్యాన్స్‌లు, సహజత్వానికి దూరంగా ఉండే యాక్షన్‌ సీన్స్‌ చేయడం పెద్దగా నచ్చదని ఎన్నోసార్లు చెప్పాడు. అందుకే ఆయన స్టెప్పులు, ఫైట్స్‌ వంటివి వీలైనంత సహజంగా ఉండేలా డిజైన్‌ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఈయన తొందరగా ఎవ్వరికీ దగ్గరకాడని, దగ్గరైతే మాత్రం ఎంతో చనువుగా జోక్‌లు వేస్తూ ఉంటాడని పేరుంది. ముఖ్యంగా తాను షూటింగ్‌లో ఉన్నప్పుడు తన పక్కన కమెడియన్‌ అలీ ఉంటే తనకు బలంగా ఉంటుందని కూడా పలుసార్లు చెప్పాడు. తనని తాను పరిచయం చేసుకునే విషయంలోనే నెమ్మదిగా ఉండే పవన్‌.. అదే ఒకరిని మరోకరికి పరిచయం చేసే స్థితికి వచ్చాడంటే ఎంతో డెప్త్‌ ఉంటే తప్ప అది జరగని పని అని అందరికీ తెలుసు. అలాంటిది హీరోయిన్‌ సమంతను అలీకి పరిచయం చేసింది స్వయాన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణే అన్న విషయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేదే. 

ఇక విషయానికి వస్తే ఓ ఇంటర్వ్యూ కార్యక్రమంలో సమంత తనకి పరిచయం అయిన విధానం గురించి అలీ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ, సమంతను నాకు పరిచయం చేసింది పవన్‌కళ్యాణ్‌గారు. పొల్లాచ్చిలో 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సందర్భంగా 'అలీగారూ.. సమంత గారు మీకు పరిచయమేనా?' అని నన్ను అడిగారు. 'లేదండి' అని సమాధానం చెప్పాను. అప్పుడు అలీని, సమంతకి పవన్‌ పరిచయం చేస్తూ 'అలీగారని.. బాగా రిచ్‌' అని సమంతకు చెబుతూ నన్ను పరిచయం చేశాడు. 

దాంతో సమంత నవ్వుతూ అలీకి సమాధానం ఇస్తూ.. ‘‘నాకు అలీగారంటే ఎంతో ఇష్టం. సెట్లో ఆయన్ను చూడగానే నవ్వొచ్చేసేది. 'అత్తారింటికిదారేది'లో ఆయనతో కలిసి నటించాను. ఆ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ సినిమా షూటింగ్‌ ఒక పిక్‌నిక్‌లా సాగిపోయింది. అందుకు కారకులు అలీగారు. ఆయన పవన్‌పై ఒక జోక్‌ వేస్తే.. ఆయనపై పవన్‌ ఒక జోక్‌ వేసేవాడు. దాంతో సెట్లో నవ్వులే నవ్వులు. ఆ సినిమా తర్వాత అలీ నా ఫేవరేట్‌ అయిపోయారు’’ అని చెప్పుకొచ్చింది. 

Samantha and Ali Funny Conversation:

Pawan Kalyan Introduces Samantha to Ali

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ