నేటి యూత్‌కి ఐకాన్‌గా అర్జున్‌రెడ్డి అలియాస్ గోవిందు.. ఉరఫ్ విజయ్‌దేవరకొండ మారాడు. ఆయన మైండ్‌సెట్‌ని, ఆయన ప్రవర్తనని అర్ధం చేసుకోవడం అంత సులువు కాదు. ఆయన మైండ్, ఆయన చేసే పనులు, ఆయన యాటిట్యూడ్ వంటివి పజిల్స్‌ని తలపిస్తూ ఉన్నాయి. ఇక ‘గీతాగోవిందం’ చిత్రంతో 100కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించి నయా స్టార్‌గా ఆవిర్భవించిన ఆయన తాజాగా ఆధ్యాత్మికత విషయమై ఓ సద్గురును ఇంటర్వ్యూ చేయడం సంచలనంగా మారింది. ఏదో తోటి సినిమా వారినో, క్రీడారంగం, బిజినెస్‌రంగం వారినో ఇంటర్వ్యూ చేసి ఉంటే ఇంతగా ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ విజయ్ మాత్రం ఓ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాస్‌దేవ్‌ను ఇంటర్వ్యూ చేసి పలుఆసక్తికర ప్రశ్నలు వేశాడు.
అసలు సంతోషం అంటే ఏమిటి? సంతోషంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించగా, దానికి సంబంధించిన వీడియోను సద్గురు తన యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. హాయ్ సద్గురు...! ప్రస్తుతం అందరు డబ్బులోనే సంతోషం ఉందని దాని వెనుకపడుతున్నారు. కొందరు మద్యం సేవిస్తే ఆనందంగా ఉంటుందంటున్నారు. మరికొందరు అమ్మాయిలతో గడిపితే ఆనందంగా ఉంటుందని చెబుతుంటారు. అసలు మనకి సంతోషాన్ని ఇచ్చేది ఏది? దేని వల్ల మనిషి సంతోషంగా ఉంటాడు? అసలు ఆనందంగా ఉండే మనిషి ఎలా ఉంటాడు? ఏం చేస్తాడు? ఆనందం మనిషి లోపల ఉంటుంది... అందులో ఉంటుంది.. ఇందులో ఉంటుంది... అనే సమాధానాలు మాత్రం చెప్పవద్దు? సరైన సమాధానం ఇవ్వండి అని అడిగాడు.
దానికి సద్గురు సమాధానం ఇస్తూ.. విజయ్.. నువ్వు పర్వతం వంటి వాడివి. అటువంటి నీవు కొండంత సంతోషంగా ఉండాలని ఎలా కోరుతున్నావ్? సంతోషంగా ఉండే వ్యక్తి ఎలా ఉంటాడా? నీలా, నాలా ఉంటాడు. ఆనందం అనేది ఒక వస్తువు... లేదా ఎంటర్‌టైన్‌మెంట్ అని మనం అనుకుంటాం. కానీ అదో సహజసిద్ద పరిణామం అని చెప్పవచ్చు. మనలో సంతోషం ఉంటుందని చెప్పవద్దు అని నీవు కండీషన్స్ పెట్టావు. నేను అలా చెప్పను. మానవుడి ప్రతి అనుభవం ఓ చర్య. అందుకే శాంతి, సంతోషం, ఆనందం.. ఇలా ఒక్కోదానిని ఒక్కో అనుభూతిగా అభివర్ణిస్తాం. నీవు ఒక జటిల రసాయన సూప్‌వి. అయితే నువ్వు గొప్ప సూప్‌వా? ప్రియమైన సూప్‌వా? అనేది మనం ఇక్కడ వేసుకోవాల్సిన ప్రశ్న. అది తెలిస్తే సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది.. అంటూ సద్గురు సమాధానం ఇచ్చారు.