నటునికి కావాల్సిన అందం, ఎత్తు, ఆజానుబాహుత్వం వంటివి ఆయనకి లేవు. ఆయన నిన్నటి దాకా ఒక్క వేషమైనా వస్తుందా? అంటూ కోటికళ్లతో ఎదురుచూసిన సామాన్యమైన నటుడు. ఇంకాచెప్పాలంటే ఆయనకంటే జూనియర్ ఆర్టిస్టులే బెటర్ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. నిజానికి సినీ పరిశ్రమ చిత్రవిచిత్రమైంది. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ద్వారా విజయ్‌దేవరకొండ ఎలా ఓవర్‌నైట్ స్టార్‌గా వెలిగాడో మనకి తెలుసు. అలా కొన్ని చిత్రాలు, కొన్ని పాత్రలు ఆయా నటీనటులను ఓవర్‌నైట్ స్టార్స్‌ని చేస్తాయి. నిన్నటివరకు ఒక్క చాన్స్ ప్లీజ్ అని దర్శకనిర్మాతల వెంటపడిన నటులే కనీసం కాల్షీట్స్ అడ్జస్ట్ చేయడానికి కూడా సమయం దొరకదు.
ప్రస్తుతం తమిళనటుడు యోగిబాబు పరిస్థితి అలానే ఉంది. నిన్నమొన్నటివరకు ఆఫర్ల కోసం నానాతిప్పలు, బాధలు పడినయోగిబాబు కోసం ఇప్పుడు దర్శకనిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నారు. తమ చిత్రాలలో నటించాలని వేడుకుంటూ.. నటిస్తే అడిగినంత మొత్తం ఇస్తామని వెంటపడుతున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా అనే ప్రధాన పాయింట్‌తో నయనతార నటించిన ‘కో..కో..కోకిల’ (కొలమావు కోకిల)సినిమాతో యోగిబాబు దశ, దిశ మారిపోయాయి.
ఈ సినిమాలో ఆయన నయనతారకు జోడీగా నటించడం, సినిమా సూపర్‌హిట్ కావడంతో యోగిబాబుకి ఊపిరి సలపనంతగా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో తలనొప్పిని భరించలేని యోగిబాబు తన డైరీ 2020డిసెంబర్ వరకు ఖాళీ లేదని చెప్పి అందరినీ పంపించి వేస్తున్నాడట. ప్రస్తుతం శ్యాంఅంటన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుర్కా’ చిత్రంలో యోగిబాబు ప్రధానపాత్రను పోషిస్తున్నాడు.