Advertisementt

ఎన్టీఆర్, విజయ్, అట్లీపై.. అశ్వినీదత్ క్లారిటీ!

Wed 19th Sep 2018 08:24 PM
ashwini dutt,interview,producer,ashwini dutt producer,jr ntr,vijay deverakonda,atlee  ఎన్టీఆర్, విజయ్, అట్లీపై.. అశ్వినీదత్ క్లారిటీ!
Ashwini Dutt About His Future Movies ఎన్టీఆర్, విజయ్, అట్లీపై.. అశ్వినీదత్ క్లారిటీ!
Advertisement
Ads by CJ

చాలా కాలం తర్వాత ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన బ్యానర్ వైజ‌యంతీ మూవీస్‌. ఆ సినిమాతో వారికి పెద్దగా పేరు రాలేదు కానీ ఆ తర్వాత నిర్మించిన ‘మ‌హాన‌టి’తో పూర్తి ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో తెరకెక్కిన ‘దేవదాస్’ చిత్రం ఈనెల  27న విడుద‌ల అవ్వబోతోంది. ఈ సినిమా విషయంలో రిలీజ్‌కి ముందే ఈ సంస్థ టేబుల్ ప్రాఫిట్‌ని ద‌క్కించుకున్నట్లుగా టాక్.

ఈ ఉత్సాహంతోనే మ‌రిన్ని కొత్త సినిమాల‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతోంది ఈ సంస్థ. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాని, విజయ్ దేవ‌ర‌కొండ‌తో మరో సినిమాని త్వరలో నిర్మించబోతున్నట్లుగా నిర్మాత అశ్వినీదత్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు డైరెక్టర్స్ తోనే కాకుండా తమిళ డైరెక్టర్‌తో కూడా ఓ మూవీ చేయబోతోన్నట్లుగా ఆయన ప్రకటించారు.

తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా త్వరలోనో ఉంటుందని, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి క‌థా చ‌ర్చ‌లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ లేదా విజయ్ తో అట్లీ ఈ బ్యానర్ లో సినిమా చేసే అవకాశముందని టాక్. రాజమౌళి మ‌ల్టీస్టార‌ర్ తర్వాత ఎన్టీఆర్ ఈ బ్యానర్ లో చేయనున్నాడట. మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ఈ బ్యానర్.. ఏ సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

Ashwini Dutt About His Future Movies:

Ashwini Dutt Latest interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ