Advertisementt

పెళ్లి తర్వాత.. వరుస హిట్స్‌తో షాకిస్తుందిగా!!

Tue 18th Sep 2018 11:01 PM
samantha,success,heroine,u turn movie,heroine samantha  పెళ్లి తర్వాత.. వరుస హిట్స్‌తో షాకిస్తుందిగా!!
Samantha Got One more hit with U Turn పెళ్లి తర్వాత.. వరుస హిట్స్‌తో షాకిస్తుందిగా!!
Advertisement
Ads by CJ

పెళ్లి తర్వాత సక్సెస్ ని తప్ప ప్లాప్స్ ని చూడని గ్లామర్ హీరోయిన్ సమంత ఈ ఏడాది అదిరిపోయే హిట్స్ అందుకుంది. ఒక్క ఏడాదిలో ఒకేసారి నాలుగు సూపర్ హిట్స్ అందుకున్న హీరోయిన్ గా సమంత రికార్డు సృష్టించింది. పెళ్లయ్యాక హీరోయిన్స్ గా పనికిరారు అనే కొందరిలో ఉన్న దురభిప్రాయాన్ని సమంత మాత్రం చాకచక్యంగా తిప్పికొట్టింది. అనుకోకుండానే.. సమంత కి పెళ్లి కలిసొచ్చిందో లేదో తెలియదు కానీ.. పెళ్లి తర్వాత రెండు బ్లాక్ బస్టర్స్ హిట్స్, రెండు సూపర్ హిట్స్ అందుకున్న సమంత మీద స్టార్ హీరోల దృష్టి పడింది. కానీ సమంత మాత్రం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఒప్పుకుంటూ చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది. రామ్ చరణ్ - సుకుమార్ - సమంత కాంబోలో వచ్చిన రంగస్థలం అదరగొట్టే హిట్ అందుకుంది. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన ఈసినిమాలో సమంత పక్కా పల్లెటూరి అవతారమెత్తింది. ఇక సావిత్రి జీవిత చరిత్రలో సమంత ద్వారానే సావిత్రి కథని ప్రేక్షకులకు పరిచయం చేసాడు దర్శకుడు. సావిత్రి జీవితం గురించి తెలుసుకోవాలని తహతహలాడే జర్నలిస్ట్ కేరెక్టర్ లో సమంత నటించి ఆ సినిమా హిట్ లో భాగమైంది.

ఇక కోలీవుడ్ హీరో విశాల్ తో కలిసి అభిమన్యుడు లాంటి సూపర్ హిట్ అందుకుంది. డాక్టర్‌గా నవ్వుతూ... ఆ సినిమాలో ట్రెడిషనల్ అందంతో అదరగొట్టింది. ఇక సమంత ఎంతో ఇష్టపడిన మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూ-టర్న్ సినిమాతో సమంత రీసెంట్ గా హిట్ అందుకుని. యు-టర్న్ కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఈ ఏడాది నాలుగు హిట్స్ అందుకున్న హీరోయిన్ గా సమంత టాప్ లెవల్లో ఉంది. యు-టర్న్ మూవీ లో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా సమంత నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. పెళ్లి తర్వాత ఆమెకి అసలు అవకాశాలే రావనుకుంటే.. ఇలా అనుకోకుండా అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ రావడం.. ఆ సినిమాలు సూపర్ హిట్స్ అవడంతో సమంత ఫుల్ హ్యాపీ. కానీ సమంత నెక్స్ట్ ఏంటి అంటే మాత్రం.. ప్రస్తుతం ఏం లేదనే చెప్పాలి. అన్నపూర్ణ స్టూడియోస్ నుండి కానీ... మనం ఎంటర్టైన్మెంట్స్ నుండి కానీ సినిమాలు నిర్మించనని.. తన ఓన్ బ్యానర్‌లో చిన్న సినిమాలు నిర్మించాలనేది తన కోరిక అని.. బయట పెట్టిన సమంత చేతిలో తెలుగులో కేవలం భర్త నాగ చైతన్య తో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా మాత్రమే ఉంది. ఇక కోలీవుడ్ లో కూడా సమంత సైన్ చేసిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి కానీ.. ఆమె కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోవడం లేదనేది కోలీవుడ్ టాక్. మరి సమంత నటి నుండి నిజంగానే యు-టర్న్ తీసుకుని నిర్మాతగా సెటిల్ అవుతుందా .. లేదా నటిస్తూనే సినిమాలు నిర్మాణం చేపడుతుందా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్.

Samantha Got One more hit with U Turn:

Samantha gets Success after Marriage 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ