కన్నడ నుండి తెలుగులోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన హీరోయిన్ రష్మిక మందన్న. కన్నడ కిర్రిక్ పార్టీ సినిమా ద్వారా పాపులర్ హీరోయిన్ గా తెలుగులోకి అడుగు పెట్టింది. తెలుగులోకి రాగానే ఛలో సినిమా హిట్ తో విజయ్ సరసన గీత గోవిందం సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఇక గీత గోవిందం సినిమాతో అతి తక్కువ కాలంలో 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన హీరోయిన్ గా రికార్డు అందుకుంది. ఆ సినిమా తర్వాత దేవదాస్ హిట్ కోసం వెయిట్ చేస్తుంది. తాజాగా విడుదలైన దేవదాస్ లుక్ లో పూజ గా రష్మిక అదిరిపోయే గెటప్‌లో కనబడుతుంది. మరి ఈ సినిమా కూడా విజయం సాధించిందంటే ఇక రష్మికకు తెలుగులో ఎదురే ఉండదు. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లేందుకులే అనుకుందో.... ఏమో.. ప్రేమికుడు రక్షిత్ తో చేసుకున్న ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంది రష్మిక.
ఆ ఎంగేజ్మెంట్ రద్దయ్యాకా రష్మిక మీద నెగెటివ్ ప్రచారం జోరుగా జరిగింది. తాజాగా రష్మిక కన్నడ ప్రేక్షకులకు మరోమారు షాకిచ్చింది. అది కూడా కన్నడ సినిమాని వదిలేసి మరీ కన్నడ ప్రేక్షకులకు షాకిచ్చింది. అక్కడ ఒప్పుకున్న ఒక సినిమా నుండి రష్మిక అర్దాంతరంగా తప్పుకుంది. ఇన్వెస్టిగేషన్ కథతో తెరకెక్కతున్న వ్రిత్రా అనే సినిమా నుండి రష్మిక తప్పుకుంది. ఈ సినిమాలో రష్మిక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సీరియస్ కేరెక్టర్ లో నటిస్తుంది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన వ్రిత్రా ఫస్ట్ లుక్ విశేషాదరణ పొందింది. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టుకునే సమయంలో రష్మిక వ్రిత్రా యూనిట్ కి హ్యాండ్ ఇచ్చింది.
ఇక ఈ సినిమా నుండి తాను తప్పుకున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కన్నడ లో వ్రిత్రా అనే సినిమా నుండి తాను తప్పుకున్నానని.. కెరీర్ మొదట్లోనే అలాంటి సీరియస్ పాత్రల్లో, అలాంటి సీరియస్ నెస్ తో కూడుకున్న సినిమాల్లో నటించకూడదని నిర్ణయంతోనే ఆ సినిమా నుండి తాను తప్ప్పుకున్నానని.. అలాగే ఈ విషయాన్నే వ్రిత్రా దర్శక నిర్మాతలకు చెప్పానని.. వారు ఓకే చెప్పారని చెబుతుంది రష్మిక. మరి గీత గోవిందం హిట్ తో రష్మిక మైండ్ సెట్ ఎంతలా మారిందో.. ఇప్పుడు రష్మిక తీసుకుంటున్న నిర్ణయాలతో అర్ధమవుతుంది. మరో పక్క కన్నడ హీరో రక్షిత్ బ్యాచ్ వ్రిత్రా సినిమాకి పనిచెయ్యడం వలన.. అది నచ్చకే రష్మిక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏది ఏమైనా తెలుగుని నమ్ముకుని రష్మిక కన్నడని లైట్ తీసుకుంటుందా అని అనిపించక మానదు.