Advertisementt

‘దేవ‌దాస్’ పార్టీకి డేట్ ఫిక్స్ చేశారు

Tue 18th Sep 2018 09:02 PM
devadas,audio party,nani,nagarjuna,devadas party  ‘దేవ‌దాస్’ పార్టీకి డేట్ ఫిక్స్ చేశారు
Date fix To Devadas Party ‘దేవ‌దాస్’ పార్టీకి డేట్ ఫిక్స్ చేశారు
Advertisement
Ads by CJ

సెప్టెంబ‌ర్ 20న దేవ‌దాస్ ఆడియో పార్టీ.. 

దేవ‌దాస్ సినిమా ఆడియా పార్టీ (లాంఛ్) సెప్టెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ లో ఈ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న అందుకుంటున్నాయి. ప్ర‌త్యేకంగా వినాయ‌క‌చ‌వితి నాడు విడుద‌లైన ల‌క ల‌క లకుమిక‌రా పాట‌కు రెస్పాన్స్ అద్భుతంగా వ‌స్తుంది. ఇక సెప్టెంబ‌ర్ 17న నాగార్జున‌, నాని సినిమాలో త‌మ‌కు జోడీగా న‌టించిన హీరోయిన్లు ఆకాంక్ష సింగ్, ర‌ష్మిక మంద‌న్న‌ల పాత్ర‌లు.. వాళ్ల పేర్ల‌ను వాళ్ల వాళ్ల ట్విట్ట‌ర్ లో విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసారు. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌రేష్ వికే, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా గ్రూప్ వ‌యాక‌మ్ 18 వ‌చ్చి దేవ‌దాస్ కోసం వైజ‌యంతి బ్యాన‌ర్ తో టై అప్ కావ‌డంతో అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా దేవ‌దాస్ విడుద‌ల కానుంది. 

న‌టీన‌టులు: నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌..

సాంకేతిక విభాగం:

ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌

నిర్మాత‌: అశ్వినీద‌త్

సంస్థ‌లు: వైజయంతి మూవీస్ మ‌రియు వ‌యాక‌మ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ 

సినిమాటోగ్ర‌ఫ‌ర్: శ్యామ్ ద‌త్ సైనూద్దీన్ 

సంగీతం: మ‌ణిశ‌ర్మ 

ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహీ సురేష్

Date fix To Devadas Party:

DevaDas audio Release on September 20

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ