Advertisementt

‘ఫిదా’ తర్వాత టాప్ బ్యానర్‌లో మూవీ..!

Tue 18th Sep 2018 08:40 PM
sekhar kammula,fidaa,asian films,fidaa,sekhar kammula and asian film movie  ‘ఫిదా’ తర్వాత టాప్ బ్యానర్‌లో మూవీ..!
Sekhar Kammula New Movie in Asian Group Banner ‘ఫిదా’ తర్వాత టాప్ బ్యానర్‌లో మూవీ..!
Advertisement
Ads by CJ

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడిగా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న ఏషియ‌న్ గ్రూప్ 

యాభై సంవ‌త్స‌రాలుగా 600ల సినిమాల‌కు  ఫైనాన్స్ అందించి ప్ర‌స్తుతం డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు సినిమా  నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. ప్రెస్టీజియ‌స్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ ల‌వ్ స్టోరికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి అయ్యాయి. మ‌ల్టీప్లెక్స్ రంగంలో ఒక రివ‌ల్యూష‌న్‌ సృష్టించిన ఏషియ‌న్ గ్రూప్  తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ధాన భాగంగా ఎదిగింది. సినిమాను ప్రేక్ష‌కుల‌కు చేరువ‌చేసే డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామిగా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు నిర్మాణ రంగంలో ఒక సుధీర్ఘ ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్టింది.  ఆ ప్ర‌యాణంలో తొలి అడుగు శేఖ‌ర్ కమ్ముల‌తో క‌ల‌సి  వేస్తుంది. నిర్మాతలుగా నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు(ఎప్.డి.సి. ఛైర్మన్) వ్యవహారించనున్నారు.

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఫిదా త‌ర్వాత శేఖర్ క‌మ్ముల చేయ‌బోయే ప్రాజెక్ట్ మీద ఇండ్ర‌స్టీలోనూ, ప్రేక్ష‌కులలోనూ ఆస‌క్తి నెల‌కొంది. కంటెంట్ ని త‌ప్ప క్రేజ్ ని న‌మ్ముకొని శేఖ‌ర్ కమ్ముల నుండి రాబోతున్న ఈ ల‌వ్ స్టోరీ కి  సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది నిర్మాణ సంస్థ‌.  అమిగోస్ క్రియేషన్స్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మించ‌బోయే ఈ ప్రేమ క‌థ‌కు 

నిర్మాత‌లు: నారాయ‌ణ దాస్ నారంగ్, పి. రామ్మోహ‌న్(ఎప్.డి.సి. ఛైర్మన్), కో ప్రొడ్యూస‌ర్-విజ‌య్ భాస్క‌ర్‌.

Sekhar Kammula New Movie in Asian Group Banner:

Sekhar Kammula next Film Confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ