Advertisementt

అల్లుడుకి అసలు సిసలైన పరీక్ష..!

Tue 18th Sep 2018 02:05 PM
sailaja reddy alludu,monday test,status under scanner,naga chaitanya,maruthi  అల్లుడుకి అసలు సిసలైన పరీక్ష..!
Real Test for Sailaja Reddy Alludu అల్లుడుకి అసలు సిసలైన పరీక్ష..!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - మారుతీ కాంబోలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా.. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన  శైలజా రెడ్డి అల్లుడు భారీ అంచనాల నడుమ గత గురువారం విడుదలైంది. సినిమాకి యావరేజ్ టాక్  వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా వస్తున్నాయి. క్రిటిక్స్ కూడా శైలజా రెడ్డి అల్లుడుకి యావరేజ్ మార్కులే  వేశారు. సినిమాలోని లోపాలను ఎత్తి చూపుతూ...శైలజా రెడ్డి అల్లుడిని క్రిటిక్స్ మొత్తం ఓవరాల్ గా యావరేజ్ రేటింగ్స్ ఇచ్చారు. అయితే శైలజా రెడ్డి అల్లుడు మొదటి రోజు కలెక్షన్స్ చూసాక.. క్రిటిక్స్ పప్పులో కాలేసారా అనిపించకమానదు. కానీ క్రిటిక్స్ తమ పని తాము చేశారు. అయినా రివ్యూస్ ని జయించిన శైలజా రెడ్డి అల్లుడు మొదటి నాలుగు రోజులు సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. మొదటి రోజు చైతు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న శైలజా రెడ్డి అల్లుడు శుక్రవారం కూడా డ్రాప్ కాలేదు. ఇక వీకెండ్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అదరగొట్టింది.

గీత గోవిందం తర్వాత సరైన సినిమా థియేటర్స్ లో లేకపోవడం... మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మారుతీ గత చిత్రాల మీదున్న నమ్మకము, నాగ చైతన్య కూడా ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ గా కనిపించడం, రమ్యకృష్ణ పాత్ర పవర్ ఫుల్ గా శైలజా రెడీ అల్లుడు ట్రైలర్ లో కనబడడంతో .. ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవడంతో.. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ... మంచి కలెక్షన్స్ వచ్చాయి. మరి మొదటి నాలుగు రోజులు పాటు శైలజా రెడీ అల్లుడుకి ఎదురు లేదు. ఇక సమంత యు టర్న్ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ... ఆ సినిమా లేడి ఓరియెంటెడ్ మూవీ కావడం... ఒక వర్గం ప్రేక్షకులకు బాగా ఎక్కడం.. బి,సి సెంటర్స్ లో యు-టర్న్ మూవీ కి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా శైలజా రెడ్డి కలెక్షన్స్ పెరగడానికి దోహద పడ్డాయి. అయితే ఈ నాలుగు రోజులు దూసుకుపోయిన అల్లుడు కష్టాలు ఈ సోమవారం మొదలవుతాయా.. అంటే చెప్పలేం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. 

ఈ సోమవారం నుండి శైలజా రెడ్డి అల్లుడు సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. హిట్ టాక్ వస్తేనే సోమవారం వసూళ్లు పడిపోతున్న ఈరోజుల్లో యావరేజ్ టాకొచ్చిన శైలజా రెడ్డి అల్లుడికి ఈ సోమవారం గట్టి పరీక్షే మొదలు కాబోతుంది. మరి ఈ సోమవారం నుండి శుక్రవారం వరకు శైలజా రెడ్డి అల్లుడుకి కలెక్షన్స్ స్టడీగా ఉంటే నిర్మాతలు లాభాల్లోకి వెళ్ళిపోతారు. మరి శుక్రవారం మళ్ళీ కొన్ని మూవీస్ వస్తుండటంతో శైలజా రెడ్డి అల్లుడు హవా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. చూద్దాం ఈ సోమవారం నుండి శైలజా రెడ్డి అల్లుడు కలెక్షన్స్ డ్రాప్ అవుతాయా.. లేదా స్టడీగా ఉంటాయా అనేది. 

Real Test for Sailaja Reddy Alludu:

Sailaja Reddy Alludu’s Status Under Scanner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ