కె.కె.రాధామోహన్ సమర్పణలో ‘భలే మంచి చౌక బేరమ్’ - అక్టోబర్ 5 విడుదల
శ్రీసత్యసాయి ఆర్ట్స్, కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ గ్రూప్ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్, పంతం వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ‘భలే మంచి చౌక బేరమ్’ చిత్రాన్ని సమర్పించడం విశేషం.
ఈ చిత్రం గురించి కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ‘‘సినిమా చూశాను. చాలా ఎంటర్‌టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అందుకే మా శ్రీసత్యసాయి ఆర్ట్స్ బేనర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాను. అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు వంటి సూపర్‌హిట్ సినిమాలతో దర్శకుడు మారుతి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు. మారుతి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా మారుతి కాన్సెప్ట్‌తో వస్తోన్న మరో డిఫరెంట్ మూవీ ‘భలే మంచి చౌక బేరమ్’.
నవీద్,‘కేరింత’ నూకరాజు, యామిని భాస్కర్, రాజారవీంద్ర, భద్రం, ముజ్‌తబా అలీ ఖాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కాన్సెప్ట్: మారుతి, కథ, మాటలు: రవి నంబూరి, సంగీతం: హరి గౌర, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జె.బి., పాటలు: పూర్ణాచారి, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., ఎడిటింగ్: ఉద్ధవ్ ఎస్.బి., ఆర్ట్: మురళి ఎస్.వి., సమర్పణ: కె.కె.రాధామోహన్ (శ్రీసత్యసాయి ఆర్ట్స్) , సహ నిర్మాతలు : గుడ్ సినిమా గ్రూప్, నిర్మాత: అరోళ్ళ సతీష్‌కుమార్,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళీకృష్ణ ముడిదాని.