ప్రస్తుతం దేవదాస్ చిత్రంలో నటిస్తున్న నాగార్జున తెలుగు తమిళంలో బైలింగువల్ మూవీలో నటించబోతున్నాడు. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చెయ్యబోయే చిత్రంలో నాగార్జున ధనుష్ తో పాటుగా ఆ సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేసుకుంది. తమిళంలో స్టార్ హీరో, తెలుగులో ఒక మాదిరి హీరోగా ఉన్న ధనుష్ కి అటు డైరెక్షన్ లోను, ఇటు నిర్మాణంలోనూ మంచి అనుభవమే ఉంది. అయితే మొదటి సినిమాతో డైరెక్టర్ గా హిట్ కొట్టిన ధనుష్ తన రెండో సినిమాని తానే ఒక హీరోగా... నాగార్జున మరో హీరోగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే అను నాగార్జునకి జంటగానా.. లేదంటే ధనుష్ కి జోడిగానా అనేది తెలియాల్సి ఉంది.
ఇక రెగ్యులర్ షూట్ లో భాగంగా మొదటి షెడ్యూల్ ని మధురైలో మొదలెట్టేశాడు. ఈ షెడ్యూల్ లో కొన్ని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తదుపరి షెడ్యూల్లో నాగార్జున జాయిన్ కానున్నారట. అయితే ధనుష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మొదట్లో నాగార్జున హీరో కాదంట. ఆ సినిమాలో ఆ రోల్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ కోసమే రాసుకున్నాడట. ఇక రజినీకాంత్ కూడా ముందు ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నప్పటికీ... తర్వాత రాజకీయాలు.. ఇతర ప్రాజెక్టులతో బిజీ అవడంతో.. ఈ సినిమాలో నటించడం కుదరకపోయేసరికి ఆ ప్లేస్ లోకి నాగార్జున వచ్చి చేరాడట. తర్వాత నాగ్ కి ధనుష్ కథ వినిపించడం కథ నచ్చిన నాగ్ ఈ సినిమాకి ఓకె చెప్పడం జరిగిపోయాయట.
ఈ విషయాన్ని హీరో కమ్ డైరెక్టర్ కమ్ నిర్మాత అయిన ధనుష్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడట. ఇక హీరోగా ఈ సినిమా ని డైరెక్ట్ చేస్తున్న ధనుష్ ఈ సినిమాలో సూపర్ స్టార్ ప్లేస్ లో నాగార్జున నటించడంతో తెలుగులో మంచి మార్కెట్ ఉంటుందని చెబుతున్నాడు. అంతేలే హీరో కమ్ డైరెక్టర్ గా ధనుష్ కి ఈ సినిమాకి కోలీవుడ్ లో క్రేజొస్తే... నాగార్జున నటించినందుకు తెలుగులోనూ బోలెడంత ఫేమ్ వస్తుంది. సో అలా రెండు భాషల్లోనూ ఈసినిమాపై అంచనాలు మొదలవుతాయి. మరి ధనుష్ ప్లాన్ చాలా బావుంది. అయితే సూపర్ స్టార్ రజిని చేయనందుకు ఈ కథ నాగ్ కి వినిపించిన తర్వాతే ధనుష్ తెలుగు, తమిళంలో ఒకేసారి ఈసినిమా చెయ్యడానికి ప్లాన్ చేసి ఉండొచ్చనేది ఇప్పుడు కొందరి భావన.