అర్జున్ సర్జా.. కన్నడిగుడైన ఈయనది సినిమా కుటుంబమే. ఈయన తండ్రి శక్తిప్రసాద్ మాజీ కన్నడ నటుడు. ఇతని అన్న కిషోర్ సర్జా కన్నడ దర్శకుడు. ఈయన భార్య నివేదిక అర్జున్ కన్నడలో ఆషారాణిగా మంచి పేరున్న హీరోయిన్. కన్నడ నటుడు రాజేష్ ఫాదర్ ఇన్ లా. ఇతని మేనల్లుళ్లు అయిన చిరంజీవి సర్జా, దృవ్‌సర్జా ఇద్దరు కన్నడనటులే. మరో ఇద్దరు మేనల్లుళ్లు అయిన అర్జున్, భరత్‌లు కూడా నటులుగా కన్నడలో ఎంట్రీ ఇచ్చారు. ఈయన పెద్ద కూతురు ఐశ్వర్యా తమిళ చిత్రాల ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈయన ఇటీవల కాలంలో కూడా ‘జైహింద్, సుభాష్, జైహింద్2, ప్రతాప్’ వంటి చిత్రాలతో పాటు ‘శ్రీఆంజనేయం, శ్రీమంజునాథ, హనుమాన్‌జంక్షన్, శివకాశి, స్వాగతం, పుట్టింటికిరా చెల్లి, లై, నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ వంటి పలు చిత్రాలలో నటించాడు.
1980-90లలో యాక్షన్‌కింగ్‌గా, సుమన్, భానుచందర్, రాజశేఖర్ వంటి వారికి ఎంతో గట్టి పోటీని ఇచ్చాడు. ఇంత సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కెరీర్ ప్రారంభంలో ఈయనకు కూడా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయట. కన్నడ పరిశ్రమలోని పెద్దలది మొదటి నుంచి ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారంట అన్నట్లుగా ఉంటుంది. వారి రాష్ట్రంలో పరభాషా డబ్బింగ్ చిత్రాలను ఆడనివ్వరు. థియేటర్లు ఇవ్వరు. దాంతో కన్నడ హీరోయిన్ల సంగతి పక్కనపెడితే హీరోలంటే మాత్రం మన వారు కాస్త ఈసడించుకుంటారు. ముఖ్యంగా తమిళులు ప్రకాష్‌రాజ్, అర్జున్ వంటి ఒకటి అరా వారిని తప్ప మిగిలిన వారిని పెద్దగా ఎంకరేజ్ చేయరు. వారికి ఉన్న కావేరి సమస్యల వంటివి వాటికి ఆజ్యం పోస్తూ ఉంటాయి.
ఇక అర్జున్ తాజాగా తన చిత్రం ‘కురుక్షేత్రం’ విడుదల సందర్భంగా మాట్లాడుతూ, మంచి, చెడు అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటాయి. చెడును పట్టించుకుంటూ కూర్చొంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. తెలిసో.. తెలియకో నేను చెడ్డవారిని మొదటి నుంచి దూరంగా పెడుతూ వచ్చాను. నేను కర్ణాటక ప్రాంతానికి చెందిన వాడిని కావడంతో వీడినెందుకు హీరోగా పెట్టుకున్నారని నా ముందే అనేవారు. అప్పుడే నేను బాగా హర్ట్ అయ్యేవాడిని. కాలక్రమంలో నేను హీరోగా, దర్శకనిర్మాతగా కూడా ఎదిగాను. నా గురించి అలా అన్నవారినందరినీ పిలిచి మరీ వర్క్ ఇచ్చాను. అదే నేను సాధించిన సక్సెస్‌గా భావిస్తాను అని చెప్పుకొచ్చాడు.