ఈవారం రిలీజ్ అయిన భార్యభర్తల సినిమాలు బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుంది. సమంత నటించిన 'యుటర్న్'...నాగ చైతన్య నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హవా సాగుతోంది. 'యుటర్న్' చిత్రం ఎవరూ ఊహించని విధంగా తొలిరోజు 2కోట్ల వసూళ్లు సాధిస్తే.. 'శైలజా రెడ్డి అల్లుడు' నాగ చైతన్య కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 12కోట్ల వసూల్ చేసి కెరీర్ బెస్ట్ గా నిలిచింది.
ప్రస్తుతం ఈరెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తున్నాయి. 'యుటర్న్' మొదటిరోజు 2కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. అందులో కోటి 10లక్షల షేర్ వచ్చింది. చైతు 'శైలజా రెడ్డి అల్లుడు' తొలిరోజు 12కోట్ల గ్రాస్ వసూల్ చేయగా..6.50 కోట్ల షేర్ ను వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. 'యుటర్న్' సినిమాకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో అదే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక చైతు సినిమాకి మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ అవన్నీ తుడిచి పెట్టేసి కలెక్షన్ల సునామి సృష్టించింది.
ఈరెండు సినిమాలకు ప్లస్ పాయింట్ ఏంటంటే వినాయక చవితి రోజు విడుదల అవ్వడం. దానికి తోడు వీకెండ్ కావడం. శని - ఆదివారాల వసూళ్లు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు. అంటే తొలి నాలుగు రోజుల్లో ఈ రెండు సినిమాలు చక్కని వసూళ్లతో ట్రేడ్ లో ఉత్సాహం నింపే ఛాన్సుంది. 7కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'యుటర్న్' మరో రెండు రోజుల్లో సేఫ్ జోన్ కి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు. అదేవిధంగా 'శైలజా రెడ్డి అల్లుడు' ఈరెండు రోజులు జోరు కొనసాగిస్తే ఇది కూడా సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అని ట్రేడ్ అంటున్నారు. మరి వీకెండ్ రిపోర్ట్ ఏం వస్తుందో అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.