కోలీవుడ్ స్టార్ హీరో డైరెక్షన్ లో టాలీవుడ్ సీనియర్ హీరో నటిస్తున్నాడు. మరా కోలీవుడ్ హీరో ధనుష్ దర్శకత్వం చేస్తే... టాలీవుడ్ హీరో నాగార్జున తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ధనుష్ కి డైరెక్టర్ గా ఇది రెండో సినిమా. ఇక నాగార్జునకి ధనుష్ చెప్పిన కథకి కనెక్ట్ అయ్యి రెండు భాషల్లో నటించడానికి ఒప్పుకోవడం.. ఈ భారీ బడ్జెట్ చిత్రం అప్పుడే పట్టాలెక్కడం రెండు జరిగిపోయాయి. ఈ మధ్యనే ప్రారంభమైన ఈ చిత్రం ఇంకా రెగ్యులర్ షూటింగ్ అయితే మొదలెట్టుకోలేదు.. నాగార్జున నటిస్తున్న దేవదాస్ సినిమా విడుదల కాగానే నాగార్జున ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే చిత్రం సెట్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.
అదితి రావ్ హైదరి, శరత్ కుమార్, ఎస్ జె సూర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గానా, లేదంటే ఏదైనా కీ రోలా అనేది తెలియాల్సిఉంది. కాకపోతే అను ఇమ్మాన్యుయేల్ కి శైలజా రెడ్డి చిత్రం తర్వాత ఈ చిత్రమే చేతిలో ఉంది. అను నటించిన శైలజా రెడ్డి మొన్న గురువారం విడుదలై యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఈచిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ ఈగో పర్సన్ గా.. గ్లామర్ గా బాగానే నటించి మెప్పించింది. ఇక శైలజా రెడ్డికి యావరేజ్ టాక్ రావడం.. అను చేతిలో సినిమాలేమి లేకపోవడం చూసిన అందరూ అను ఇమ్మాన్యుయేల్ పని ఇక ఖాళీ అన్న టైం లోనే.. ఈ అమ్మడు నాగార్జున సినిమాలో నటిస్తుంది అనేది బయటికొచ్చిన లేటెస్ట్ మేటర్.
మరి లక్కేమోగాని.. అనుని అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఆదుకుందనే చెప్పాలి. రవితేజ - శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కుతున్న అమర్ - అక్బర్ - ఆంటోని సినిమా నుండి డేట్స్ లేవని తప్పుకున్న అను కి శైలజా రెడ్డి అల్లుడు హిట్ అవుతుందనే నమ్మకం ఉండేది. కానీ శైలజా రెడ్డి టాక్ చూసిన అను ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు నాగ్ సినిమాకి ఒకే చెప్పేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఏడాది అజ్ఞాతవాసి, నా పేరు సూర్య తో డిజాస్టర్స్ అందుకున్న అను కి శైలజా రెడ్డి కూడా యావరేజ్ టాక్ రావడంతో పిల్లకి కాస్త కంగారు ఎక్కువైంది. తన కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ కూడా పడడం లేదనే ఫీల్ అవుతుంది. ఎందుకంటే గీత గోవిందం లాంటి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న అనుది బ్యాడ్ లక్కే కదా...!