సాధారణంగా ఫ్లాప్‌లో ఉన్నప్పుడే మన హీరోయిన్లకు వేదాంతం గుర్తుకు వస్తుంది. ప్రతి ఒక్కరు చెప్పేమాట ఏమిటంటే.. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. మేము నేర్చుకున్నది బొట్టంతా.. నేర్చుకోవాల్సింది సముద్రమంత అని చెబుతూ ఉంటారు. కానీ ఒకసారి ఏయన్నార్ 70ఏళ్లు వచ్చి కాటికి కాలు జాపుకున్నా.. ఇంకా నేర్చుకోవాల్సి ఉంది అంటారు. వారి బొంద. ఇకేం నేర్చుకుంటారు...? అని సెటైర్ వేశాడు.
ఇక విషయానికి వస్తే ఈ మధ్య జోరు తగ్గిన హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్. 'జయజానకి నాయకా, స్పైడర్' చిత్రాలు అమ్మడుకి బాగానే షాక్‌నిచ్చాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ, ప్రతి సినిమా ఒక కొత్త అనుభవానిస్తే, రోజుకో కొత్త విషయం తెలుసుకుని ఇంటికి వస్తుంటా..! ఆ అనుభవాలు, వాటితో నేర్చుకున్న విషయాలతోనే వృత్తితోపాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా మెరుగుపరుచుకుంటూ ఉంటాను. హీరోయిన్‌గా తొలి రోజులకి ఇప్పటికీ ఎంతో మారిపోయాను. మార్పు మంచిదే. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నామంటూ నా దృష్టిలో ఏదో తప్పు జరుగుతున్నట్లే.
మానసికంగా నేనెప్పుడు దృఢమే. వృత్తిపరమైన విషయాలలో కాస్తభయం, బెరుకు ఉండేవి. ఇప్పుడు మరింత పరిణతితో ఆలోచిస్తున్నా...పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు వెళ్లడం అవసరం. అనుభవం పెరిగే కొద్ది నటన పరంగా నేను చేయాల్సింది చాలా ఉందనే విషయం బోధపడుతోంది... అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె సూర్య చిత్రంతో పాటు ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవిగా నటించనుందని వార్తలు వస్తున్నాయి.