త్రివిక్రమ్‌లోని మాటల మాంత్రికుడిగా ఆయన ప్రతిభను ఎవ్వరూ కాదనలేరు. కానీ దర్శకునిగా మాత్రమే ఆయనపై కాస్త విమర్శలు ఉన్నాయి. ఇతర అరువు కథలను తనదైన శైలిలో కాపీ కొడతాడనే అపవాదు ఆయనపై ఉంది. ముఖ్యంగా ఆయన పవన్‌కళ్యాణ్‌తో తీసిన 'అజ్ఞాతవాసి' చూసిన వారికి ఆ చిత్రానికి నిజంగా ఆయనే సంభాషణలు, కథ, దర్శకత్వం వహించాడా? లేదా ఎవరైనా ఘోస్ట్‌తో చేయించాడా? అనే అనుమానం రాకమానదు. కొందరు మాత్రం అందులో పవన్ ప్రమేయం ఎక్కువగా ఉండటమే ఆ చిత్రం అవుట్‌పుట్ అలా రావడానికి కారణంగా చెబుతారు. ఇక రచయితగా ఈయన 'స్వయంవరం' నుంచి తన ప్రతిభను చాటుతున్నా కూడా ఈయనకు రైటర్‌గా స్టార్‌డమ్‌ని తెచ్చి పెట్టిన చిత్రాలు మాత్రం వెంకటేష్‌తో పనిచేసిన 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి'లు. ఇక ఈయన కరుణాకరన్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన 'వాసు' చిత్రానికి కూడా రచయితగా పనిచేశాడు.
ఇక విషయానికి వస్తే 'అజ్ఞాతవాసి' డిజాస్టర్‌ని కూడా కాదని త్రివిక్రమ్‌తో ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం చేస్తున్నాడు. కేవలం తన హారిక అండ్ హాసిని బేనర్‌లో త్రివిక్రమ్‌తోనే చిత్రాలు తీస్తానని ప్రకటించిన రాధాకృష్ణ అలియాస్ చినబాబునే దీనిని కూడా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే నెల అంటే అక్టోబర్ 11న విజయదశమి కానుకగా విడుదల కానుంది. ఈనెల 20న ఆడియో వేడుకను జరుపనున్నారు. ఈ చిత్రంలో త్రివిక్రమ్ తనపై వస్తున్న విమర్శలకు ధీటైన సమాధానం చెబుతాడని అందరు ఆశిస్తున్నారు. ఇక దీని తర్వాత చిత్రం ఆయన అల్లుఅర్జున్‌తో చేస్తాడని వార్తలు వస్తున్నా కూడా ముందుగా వచ్చిన వార్తలకు తగ్గట్టుగానే ఆయన వెంకటేష్‌తో ఓ చిత్రం చేయనున్నాడట. వాస్తవానికి ఈ చిత్రం కథ కూడా తయారైందని, మొదట ఈ కథను పవన్‌కళ్యాణ్‌కి త్రివిక్రమ్ వినిపించాడని సమాచారం. కథ బాగా నచ్చినా కూడా పవన్ త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలలో బిజీ అయ్యాడు. దాంతో అదే కథను ఆయన వెంకటేష్‌తో చేయనున్నాడు.
ప్రస్తుతం వెంకటేష్ వరుణ్‌తేజ్, అనిల్‌రావిపూడి, దిల్‌రాజుల కాంబినేషన్‌లో రూపొందుతున్న మల్టీస్టారర్ 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్), ఆతర్వాత బాబి దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్ 'వెంకీ మామా' చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత దర్శకునిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించే మూవీ మొదలు కానుందట. మరి ఇంత గ్యాప్‌ని సాధారణంగా స్క్రిప్ట్ విషయంలో బాగా సమయం తీసుకునే త్రివిక్రమ్ వెంకీ చిత్రానికి కూడా తీసుకుంటాడా? లేక ఈ మధ్యలో మరో చిత్రం చేస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది. మరి రైటర్‌కి, వెంకీకి అద్భుతమైన హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకునిగా ఆయనకు ఎలాంటి హిట్‌ని ఇవ్వనున్నాడు? ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని సంస్థే నిర్మిస్తుందా? అనేవి వేచిచూడాల్సివుంది...!