Advertisementt

ఈ ‘సామి’ కూడా వచ్చేస్తున్నాడు

Sat 15th Sep 2018 10:54 PM
saamy,vikram,release date,hari director,keerthi suresh  ఈ ‘సామి’ కూడా వచ్చేస్తున్నాడు
Vikram Saamy Release Date Fix ఈ ‘సామి’ కూడా వచ్చేస్తున్నాడు
Advertisement
Ads by CJ

భారీ కమర్షియల్ హంగులతో సెప్టెంబర్ 21న రాబోతోన్న ‘సామి’

పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ‘సామి’. ‘సింగం, సింగం 2 , సింగం 3 , పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన ‘సామి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడదే టైటిల్‌తో తెలుగులో రాబోతోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ మాట్లాడుతూ... ‘‘ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్ తోనే హరి గారు దుమ్ము దులిపేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్‌గారి నట విశ్వరూపం ఇందులో చూస్తారు. హరిగారి గురించి, ఆయన తీసే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తక్కువగా మాట్లాడతారు. మొత్తం ఆయన సినిమాలే చూసుకుంటాయి. దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’’ అని అన్నారు. 

Vikram Saamy Release Date Fix :

Saamy Release on September 21

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ