సూపర్ స్టార్ మహేష్ బాబుకి ‘స్పైడర్’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు మంచి గుణపాఠం నేర్పాయి. అందుకే ఇప్పుడు మహేష్ దర్శకనిర్మాతలకు కొత్త రూల్స్ పెట్టి ముచ్చెమటలు పటిస్తున్నారట. స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మహేష్. ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ రెండు సినిమాల బౌండ్ స్క్రిప్టులను పూర్తిగా చూసుకున్న తర్వాతనే మహేష్ పూర్తిగా ముందుకెళ్లాడు. అందుకే అవి బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి.
ఇక నుంచి కూడా అదే పాలసీని కంటిన్యూ చేయనున్నాడట మహేష్. అందుకే మహేష్ దగ్గరకు ఎవరన్నా డైరెక్టర్స్ స్టోరీ లైన్ పట్టుకుని వెళ్తే అతను వినట్లేదట. పూర్తిగా బౌండ్ స్క్రిప్టుతో తనవద్దకు రావాలని చెబుతున్నాడట. అలా పూర్తి స్క్రిప్ట్ ఉందని ఎవరైనా వస్తే అప్పుడు వారి కోసం టైం కేటాయించి స్టోరీ వింటున్నాడట మహేష్.
ఇలా పూర్తి బౌండ్ స్క్రిప్టులు వినడం మంచి అలవాటే అంటున్నారు సీనియర్స్. ప్రస్తుతం మహేష్.. ‘మహర్షి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా తర్వాత మహేష్.. సుకుమార్ డైరెక్షన్ లో ఒకటి..ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయనున్నాడు.