Advertisementt

నాన్నతో ప్రాబ్లమ్ ఇదేనంటున్న చైతూ..!

Wed 12th Sep 2018 10:10 PM
naga chaitanya,nagarjuna,fans,social media  నాన్నతో ప్రాబ్లమ్ ఇదేనంటున్న చైతూ..!
Naga Chaitanya About Nagarjuna నాన్నతో ప్రాబ్లమ్ ఇదేనంటున్న చైతూ..!
Advertisement
Ads by CJ

ఈమధ్య నాగార్జున కాస్త పెద్దరికంగా మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. కానీ ఆయనకు ఉన్న రొమాంటిక్‌ ఇమేజ్‌ గురించి అందరికీ తెలుసు. గ్రీకువీరుడిగా, నవమన్మథుడిగా ఆయన పేరును అందరు చెప్పుకుంటారు. కానీ ఈమధ్య నాగచైతన్య-సమంతల వివాహం తర్వాత వచ్చిన 'రాజు గారి గది 2' ప్రమోషన్స్‌లో మాత్రం ఓ టీవీ యాంకర్‌ నవమన్మథునిగా ఉన్నారు అని ప్రశంసిస్తే పక్కనే కోడలు ఉన్న విషయం తెలుసుకోండి అని కోపగించుకున్నాడు. 

ఇక నాగార్జునకి ఇంత వయసు వచ్చి పెళ్లయిన పిల్లలు, మామ పోస్ట్‌, త్వరలో తాతగా ప్రమోషన్‌ రానున్నా కూడా ఇప్పటికీ ఆయన అభిమానులు నాగార్జున నాగచైతన్య-అఖిల్‌లకి ఫాదర్‌గా కాదు.. బ్రదర్‌గా కనిపిస్తాడనే కాంప్లిమెంట్స్‌ మాత్రం రావడం ఆగలేదు. ఇక విషయానికి వస్తే 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం విడుదల సందర్భంగా నాగచైతన్య ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్న, దానికి చైతు ఇచ్చిన సమాధానం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. 

నాగార్జున నటిస్తున్న 'దేవదాస్‌' చిత్రంలోని ఓ స్టిల్‌ని పోస్ట్‌ చేసిన అభిమాని 'ఈ పిక్‌ గురించి ఒక మాట చెప్పండి' అని చైతూని అడిగాడు. దానికి చైతు సమాధానం ఇస్తూ 'రోజు రోజుకి ఆయన వయసు తగ్గిపోతోంది. అదే నా సమస్య' అని ఫన్నీగా సమాధానం చెప్పాడు. ఇది చూసి నెటిజన్లు సరదా సరదా కామెంట్స్‌ పెడుతున్నారు. చైతు ఏ ఉద్దేశ్యంతో ఆ మాట చెప్పినా కూడా అది అక్షరసత్యమనే అందరు ఒప్పుకోవాలి. 

Naga Chaitanya About Nagarjuna:

Naga Chaitanya Chit Chat with Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ