Advertisementt

ఆ హీరోయిన్.. హీరోని చంపేస్తుందనుకున్నారట!

Wed 12th Sep 2018 04:56 PM
preity zinta,experience,salaam namaste,saif ali khan  ఆ హీరోయిన్.. హీరోని చంపేస్తుందనుకున్నారట!
Preity Zinta Experience about Salam Namaste ఆ హీరోయిన్.. హీరోని చంపేస్తుందనుకున్నారట!
Advertisement
Ads by CJ

మణిరత్నం షారుఖ్‌ఖాన్‌ హీరోగా తీసిన ‘దిల్‌సే’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయి, జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా రూపొందిన బ్లాక్‌బస్టర్‌ ‘ప్రేమంటే ఇదేరా’తో యువత హృదయాలను కొల్లగొట్టిన హిమాచల్‌ ప్రదేశ్‌ భామ ప్రీతిజింటా. ఈమెకి ఆమె సొట్టబుగ్గలే ఎంతో అందం, ఆకర్షణ. ఇక ఈమె.. మహేష్‌ బాబు తెరంగేట్రం చేసిన ‘రాజకుమారుడు’ చిత్రంలో నటించి మహేష్‌కి తొలి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రశంసలను కూడా పొందింది. ఈమె నవామ్‌ సైఫ్‌ అలీఖాన్‌ నటించిన ‘సలాం నమస్తే’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదలై 13ఏళ్లయింది. 

ఈ సందర్భంగా ప్రీతిజింటా మాట్లాడుతూ.. వావ్‌.. సినిమా షూటింగ్‌లో ఎంతో ఎంజాయ్‌ చేశాను. కెమెరా ముందు, వెనుక సైఫ్‌తో విపరీతంగా కొట్లాడే దానిని, ఒక్కోసారి నటించడం మానేసి జీవించేదానిని. దీంతో నేను సైఫ్‌ని నిజంగా చంపేస్తానేమో అని యూనిట్‌ వారు భయపడే వారు. అంతలా కొట్టుకున్నాం. సైఫ్‌ని మిస్సవుతున్నాను. సలాం నమస్తేకి 13ఏళ్లు పూర్తయ్యాయి.. అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పోస్ట్‌ నెజిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

ఐపీఎల్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కి సహయజమానిగా ఉన్న ఈమే.. సినిమాలు తగ్గించి అతిధిపాత్రలకే పరిమితమైంది. వ్యాపారవేత్తగా సెటిల్‌ అయిన ఆమె 2016లో తన స్నేహితుడు జీన్‌ గోడెనెఫ్‌ని వివాహం చేసుకుని సుఖంగా సంసారం చేసుకుంటోంది.

Preity Zinta Experience about Salam Namaste:

When Preity Zinta wanted to kill Saif Ali Khan on Salaam Namaste sets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ