సాధారణంగా దక్షిణాది, అందునా తెలుగు చిత్రాల కంటే బాలీవుడ్ చిత్రాలలో హాట్ సీన్స్, కిస్‌లు, లిప్‌లాక్‌లు బోల్డ్‌కంటెంట్‌లు ఎక్కువగా ఉంటాయనేది నిజమే. కానీ ఈ విషయంలో కూడా తెలుగు సినిమాలు బాలీవుడ్‌ని మించి పోతున్నాయా? అనే అనుమానం రాకమానదు. ఎందుకంటే ఓ తెలుగు చిత్రంలో ఓ నటి చేసిన సీన్స్‌ని ఆ చిత్రం బాలీవుడ్ రీమేక్‌లో నటించడానికి అందులోని హీరోయిన్లు భయపడి పోతున్నారంటే తెలుగు సినిమా స్థాయి ఈ విషయంలో కూడా ఎంతగా ఎదిగిందో అర్ధమవుతోంది.
ఇక విషయానికి వస్తే తెలుగులో శివ తరహాలో మరో కొత్త ట్రెండ్‌ని సెట్ చేసిన చిత్రంగా ‘అర్జున్‌రెడ్డి’ని చెప్పాలి. ఈ చిత్రం సాధించిన స్ఫూర్తితోనే ‘ఆర్‌ఎక్స్ 100’తో సహా ఎన్నో చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ చిత్రం కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్‌దేవరకొండ, షాలిని పాండే, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా వంటి వారికి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. తమిళంలో ప్రఖ్యాత దర్శకుడు బాలా దర్శకత్వంలో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతుండగా, బాలీవుడ్‌లో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలోనే షాహిద్‌కపూర్ నటిస్తున్నాడు.
ఇందులో హీరోయిన్‌గా సుతారియాను ఎంచుకున్నారు. అయితే ‘అర్జున్‌రెడ్డి’ ఒరిజినల్‌లో షాలిని పాండే చేసిన బోల్డ్ సీన్స్ చూసి సుతారియా భయపడిపోయిందట. లిప్‌లాక్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో తాను నటించలేనని ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని యూనిట్ దృవీకరించింది. మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.