Advertisementt

చరణ్ మూవీలో అన్నయ్య పాత్ర అది కాదు: నరేష్

Mon 10th Sep 2018 03:03 PM
aryan rajesh,role,ram charan,boyapati srinu,movie  చరణ్ మూవీలో అన్నయ్య పాత్ర అది కాదు: నరేష్
Allari Naresh Says Aryan Rajesh Role in Charan Movie చరణ్ మూవీలో అన్నయ్య పాత్ర అది కాదు: నరేష్
Advertisement
Ads by CJ

స్వర్గీయ దర్శకులు ఈవివి సత్యనారాయణ కుమారులైన ఆర్యన్‌ రాజేష్‌లో మంచి హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నప్పటికీ 'ఎవడిగోల వాడిది, లీలామహల్‌ సెంటర్‌' వంటి కొన్ని హిట్స్‌ తర్వాత కనుమరుగయ్యాడు. ఇక అల్లరి నరేష్‌ మాత్రం నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ స్థానాన్ని భర్తీ చేయగలనని నిరూపించుకున్నాడు. కానీ తండ్రి మరణం వల్ల సరైన గైడెన్స్‌ లేకపోవడం వల్ల కాబోలు ఈ ఇద్దరు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే ఆర్యన్‌ రాజేష్‌ కంటే అల్లరినరేష్‌ మాత్రం బెటరనే చెప్పాలి. కానీ ఆయన చిత్రాల ఎంపిక సరిగా ఉండటం లేదు. 

తాజాగా ఆయన సునీల్‌ని తోడుగా తీసుకుని 'సిల్లీఫెల్లోస్‌'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌ మాట్లాడుతూ, నేను మహేష్‌బాబు గారి 25వ చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో నా పాత్ర 'గమ్యం'లోని గాలి శ్రీను పాత్ర తరహాలో ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇక తన అన్నయ్య ఆర్యన్‌ రాజేష్‌ రామ్‌చరణ్‌-బోయపాటి శ్రీను చిత్రంలో నటిస్తున్నాడని, అయితే ఈమధ్య వార్తలు వచ్చినట్లు అది నెగటివ్‌ పాత్ర కాదని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో అన్నయ్య ఎంతో మంచి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తీసుకుని వస్తుంది. 

అన్నయ్య సాధారణంగా ఎవ్వరితో ఏమీ మాట్లాడరు. తన చిత్రాల విషయం గురించి ప్రస్తావించరు. కాబట్టే అన్నయ్య సినిమా గురించి కూడా నేనే చెబుతున్నానని నవ్వుతూ తెలిపాడు. మరి వంశీపైడిపల్లి అల్లరి నరేష్‌కి, బోయపాటి శ్రీను ఆర్యన్‌ రాజేష్‌కి మంచి హిట్స్‌ని ఇచ్చి వాళ్లను మరలా బిజీ చేస్తారనే నమ్మకం మాత్రం ఇరువురిలో బలంగా ఉంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ రెండు చిత్రాలు వారికి ఎలాంటి బ్రేక్‌నిస్తాయో వేచిచూడాల్సివుంది...! 

Allari Naresh Says Aryan Rajesh Role in Charan Movie:

Aryan Rajesh Role in Ram Charan and Boyapati srinu Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ