Advertisementt

ఇలాంటివి కామన్‌ అని సర్దుకుపోతోంది

Sun 09th Sep 2018 05:08 PM
nick jonas,olivia culpo,happy,priyanka chopra  ఇలాంటివి కామన్‌ అని సర్దుకుపోతోంది
Nick Jonas’s ex Olivia Culpo ‘happy’ about his engagement to Priyanka ఇలాంటివి కామన్‌ అని సర్దుకుపోతోంది
Advertisement
Ads by CJ

కిందటి నెల ఆగష్టు 18వ తేదీన ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో గ్లోబల్‌ నటి ప్రియాంకా చోప్రా, హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ల నిశ్చితార్థ వేడుక జరిగిన విషయం తెలిసిందే. త్వరలో ఈ జంట వివాహం చేసుకుని ఒకటి కాబోతున్నారు. అయితే ప్రియాంకా చోప్రాకి ముందు నిక్‌ మరో ఇద్దరు భామలతో డేటింగ్‌ చేశాడు. వారిలో మాజీ మిస్‌ యూనివర్శ్‌ ఒలీవియా కల్పో కూడా ఒకరు. 2012లో విశ్వసుందరిగా ఎంపికైన ఒలీవియా కల్పో బాగా ఫేమస్‌ అయింది. ఈ క్రమంలో 2013లో నిక్‌ -ఒలీవియా ప్రేమకథ మొదలైంది. రెండేళ్లు ఎఫైర్‌ నడిపిన అనంతరం వీరు విడిపోయారు. 

ప్రస్తుతం ఒలీవియా అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ డానీ అమెడోలాతో డేటింగ్‌ చేస్తోంది. తాజాగా ఆమె ప్రియాంకాచోప్రా-నిక్‌ల నిశ్చితార్ధంపై స్పందించింది. ఎప్పుడైనా , ఎవరైనా, ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చు. పైగా ఇండస్ట్రీలో ఇవ్వన్నీ చాలా కామన్‌. నిక్‌ విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. అతడికి కొత్త ప్రేమ దొరికింది. జీవితాంతం అతను సంతోషంగా ఉంటే.. నా కన్నా ఎక్కువగా సంతోషించే వారు మరెవ్వరూ ఉండరు... అంటూ తన స్పందనను తెలియజేసింది. నిక్‌తో ప్రియాంకా ఎంగేజ్‌మెంట్‌ జరిగిన నేపధ్యంలో ఆమె ఇలా హుందాగా స్పందించడం చూస్తే ఆమెది విశాల హృదయమేనని ఒప్పుకోవాలి. 

Nick Jonas’s ex Olivia Culpo ‘happy’ about his engagement to Priyanka:

Olivia Culpo breaks silence on ex Nick Jonas getting engaged

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ