Advertisementt

మహేష్ బాబు న్యూ లుక్: మాములుగా లేదు

Sun 09th Sep 2018 11:25 AM
mahesh babu,social media,avinash gowariker,mahesh babu new look  మహేష్ బాబు న్యూ లుక్: మాములుగా లేదు
Mahesh Babu New Photo Sensation in Social Media మహేష్ బాబు న్యూ లుక్: మాములుగా లేదు
Advertisement
Ads by CJ

మహేష్ బాబు టాలీవుడ్ అందగాడు. మహేష్ అందం గురించి ఎంత చెప్పిన తక్కువే అన్నట్టుగా ఉంటుంది మహేష్ అందం. ఈ వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిలా మహేష్ ఫిట్నెస్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అందం కానివ్వండి ఆకర్షణ కానివ్వండి... ఏదైనా సరే.. మహేష్ తర్వాతే అన్నట్టుగా ఉంటుంది. భరత్ అనే నేను లో యంగ్ అండ్ సూపర్ సీఎం గా అదరగొట్టిన మహేష్ బాబు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహర్షి మూవీలో ఎంబీఏ స్టూడెంట్ గా.. స్టూడెంట్ లుక్ లో అదరగొడుతున్నాడు. జుట్టు పక్కకి దువ్వి, గళ్ళ చొక్కా వేసుకుని.. స్టూడెంట్ అంటే ఇలానే ఉంటాడనిపిస్తున్నాడు. స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో మహేష్ అదరగొడుతున్నాడు.

మహర్షి షూటింగ్ ఇప్పటివరకు డెహ్రాడూన్ లోని కాలేజ్ సెట్ లోను అలాగే హైదరాబాదులో మరో షెడ్యూల్ పూర్తి చేసుకుని... ఫారిన్ షూటింగ్ కోసం పయనం కాబోతుంది. ఇక ఫారిన్ షూటింగ్ లో దాదాపుగా నెల రోజులు పాటు స్పెండ్ చేయబోతుంది మహర్షి టీం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నమహర్షి లో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ఫారిన్ లొకేషన్స్ లో అమెరికా లోని కొన్ని నగరాల్లో పోష్ అర్బన్ కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేలా రిచ్ లొకేషన్స్ ఎంపిక చేసుకుని ఆ లొకేషన్స్ లో మహర్షి లోని కీలక సన్నివేశాలను వంశీ పైడిపల్లి చిత్రీకరించన్నాడు.

ప్రస్తుతం మహర్షి మోషన్ పోస్టర్ తో పాటుగా మహర్షి మహేష్ లుక్ అదరగొడుతుంటే ఇప్పుడు మెస్మరైజ్డ్ లుక్స్‌తో మెరిసిపోతున్న మహేష్ పిక్ ఒకటి బైటికొచ్చింది. నిజంగా ఆ లుక్ లో మహేష్ ని ఎంత పొగిడినా తక్కువే అన్నట్టుగా ఉంది. అంత అందంగా అంత ఆకర్షణగా చాలా బావున్నాడు మహేష్. మహేష్ న్యూ లుక్ ని మరాఠీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గౌరిక్కర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఆ ఫొటోతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ తో పనిచెయ్యడం చాలా బావుందని.. ఆనందం కలిగించిందని అతను ట్వీట్ చేసాడు. ప్రస్తుతం అవినాష్ గౌరిక్కర్ పోస్ట్ చేసిన మహేష్ న్యూ లుక్ ఒకటి సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

Mahesh Babu New Photo Sensation in Social Media:

PostPackUpShot with the Super Charming, Super Fast SuperStar Mahesh Babu.. Avinash Gowariker Posted

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ